గుంటూరులో ఘోర ప్రమాదం.. పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

news18-telugu
Updated: February 20, 2020, 5:37 PM IST
గుంటూరులో ఘోర ప్రమాదం.. పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
గుంటూరులో ట్రాక్టర్ బోల్తా
  • Share this:
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతిచెందారు. తెనాలి మండలం చినరావూరులో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా చుండూరు మండలం చినపరిమి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అతి వేగం వల్ల అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ప్రయాణిస్తునట్లు సమాచారం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. మృతలను చూసి తోటి ప్రయాణికులు గుండలవిసేలా రోదించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు