హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road accident: ఘోరం.. మినీ బస్సును ఢీకొట్టిన జీపు.. నలుగురు దుర్మరణం..మరో 13 మంది..

Road accident: ఘోరం.. మినీ బస్సును ఢీకొట్టిన జీపు.. నలుగురు దుర్మరణం..మరో 13 మంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: ఝాన్సీ-మీర్జాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మినీబస్సును జీపు బలంగా ఢీకొట్టింది.

ఉత్తరప్రదేశ్‌లో (Uttar pradesh)  రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సును జీపు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఝాన్సీ-మీర్జాపూర్ రహదారిపై రైల్వే క్రాసింగ్ సమీపంలో సాయంత్రం 4.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర కుమార్ రాయ్ తెలిపారు.

ఇక్కడి ఖోహ్ గ్రామంలో సోమవారం మినీ బస్సును జీపు (Road accident) ఢీకొనడంతో కనీసం నలుగురు మరణించగా, 13 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. జీపు చిత్రకూట్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా, మినీ బస్సు ప్రయాగ్‌రాజ్ నుండి చిత్రకూట్‌కు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇరు వాహానాలలోని ప్రయాణికులు ఎగిరికిందపడ్డారు. అక్కడ ప్రదేశంలో చెల్లాచెదురుగా శరీర భాగాలు తెగిపడ్డాయి. వెంటనే స్థానికలకు బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఏపీలో గతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరుస ప్రమాదాలు  భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాదం (Road Accidents) వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి.. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు (Summer Holidays) కావడం.. అందులోనే వారంతం అవ్వడంతో.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం (Srisailam) పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని భక్తులు ఆశించారు. అనుకున్నట్టే సంతోషంగా శ్రీశైలానికి చేరుకున్నారు.. అనుకున్నట్టు స్వామివారిని దర్శించుకుని.. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆ దేవుడి కృప తమకు దక్కిందని ఆనందంగా కనిపించారు.. ఆ ఆనందంతో తిరిగి ఇంటికి పయనం అయ్యారు.

శ్రీశైలంలో స్వామి దర్శనం మాటల గురించి అంతా ముచ్చట్లు పెట్టుకొని.. హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. అంతా తమ గ్రామ సరిహద్దుకు కూడా చేరుకున్నారు. కాసేపట్లో ఎవరి ఇంటికి వారు వెళ్తామని చెప్పుకుంటున్నారు. ప్రయాణం చేసి అలసిపోయామని. కాసేపటికి ఇంటికి చేరాగానే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుటన్నారు. కానీ ఊహించని కుదుపు వారి జీవితాల్లో విషాదం నింపింది.

First published:

Tags: Road accident, Uttar pradesh

ఉత్తమ కథలు