HOME »NEWS »CRIME »4 killed and 4 injured as speeding car runs over pedestrians crashes into restaurant wall nk

Car Accident: ముంబైలో దూసుకెళ్లిన కారు... నలుగురు మృతి, నలుగురికి గాయాలు

Car Accident: ముంబైలో దూసుకెళ్లిన కారు... నలుగురు మృతి, నలుగురికి గాయాలు
Car Accident: ముంబైలో దూసుకెళ్లిన కారు... నలుగురు మృతి, నలుగురికి గాయాలు

Car Accident: కారుకు యాక్సిలరేటర్... బాడీకి కాలు ఉంటే చాలు... కొంత మంది అస్సలు ఆగలేరు. రాష్ డ్రైవింగ్‌తో ఇతరుల ప్రాణాలు తీస్తారు.

  • Share this:
    అది ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ ఏరియా. అక్కడుంది జనతా కేఫ్ హోటల్. మరీ ఫేమస్ కాదు గానీ... కరోనా వచ్చాక... దాన్ని అప్‌గ్రేడ్ చేసి... సరికొత్తగా తీర్చి దిద్దారు. అందువల్ల ఆ హోటల్‌కి ప్రజలు బాగానే వస్తున్నారు. సోషల్ డిస్టాన్స్ పాటించడం కుదరట్లేదు. మాగ్జిమం ట్రై చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఇప్పుడిప్పుడే తమ వ్యాపారం కుదురుకుంటోందని హోటల్ యాజమాన్యం భావిస్తున్న రోజుల్లో... సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిందో దారుణం. ఓ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఏకంగా హోటల్‌ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జైంది. ఐతే... హోటల్ దగ్గర నడుస్తున్న వారిని ఆ కారు ముందుగా ఢీ కొట్టి ఆ తర్వాత గోడను కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు... స్పాట్‌లోనే చనిపోయారు. గాయపడిన మరో ముగ్గుర్ని హడావుడిగా... జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

    అందరూ షాక్ అయ్యారు. ఫుట్‌పాత్ పైకి ఎక్కి మరీ... గోడను కొట్టిన మారుతీ ఎస్టీమ్ కారు తుక్కుతుక్కైంది. గోడ కూడా కూలిపోయింది. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సమీర్ డిగ్గీ కూడా గాయపడ్డాడు. అతనికి కూడా జేజే ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది.



    పోలీసుల ప్రకారం... ఈ సమీర్... మూడు నెలల కిందట ఓ కార్ యాక్సిడెంట్ చేశాడు. ఓ ట్రక్కును ఢీకొట్టాడు. ఆ ఘటనలో ఎవరూ చనిపోలేదు. ఇప్పుడు మరో యాక్సిడెంట్ చేసి ప్రజల ప్రాణాలు తీశాడు.
    Published by:Krishna Kumar N
    First published:September 01, 2020, 06:36 IST