విహారయాత్రలో విషాదం.. పెన్నా నదిలో మునిగి నలుగురు మృతి

ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు పెన్నా నదిలో దిగారు. కాస్త లోతుకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. వారిని కాపాడేందుకు మరో వ్యక్తి నదిలో దిగాడు. నీట మునిగి అతడు కూడా చనిపోయాడు.

news18-telugu
Updated: January 2, 2020, 7:25 PM IST
విహారయాత్రలో విషాదం.. పెన్నా నదిలో మునిగి నలుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కడప జిల్లాలో విహారయాత్రలో విషాదం నెలకొంది. సిద్ధవటం వద్ద పెన్నా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారిని కర్నాటకలోని రాయిచూర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. కర్నాటకలో స్కూళ్లకు సెలవులు ఉండడంతో వారంతా కడప జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం సిద్ధవటం వద్ద పెన్నా నదిని చూసేందుకు వెళ్లారు. ఐతే ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు పెన్నా నదిలో దిగారు. కాస్త లోతుకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. వారిని కాపాడేందుకు మరో వ్యక్తి నదిలో దిగాడు. నీట మునిగి అతడు కూడా చనిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడి చేరుకుకొని.. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: January 2, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading