హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Breaks out In Covid-19 Hospital: కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు కరోనా పెషేంట్స్ మృతి..

Fire Breaks out In Covid-19 Hospital: కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు కరోనా పెషేంట్స్ మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కోవిడ్ పెషేంట్లు మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు

కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కోవిడ్ పెషేంట్లు మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాయ్‌పూర్‌లోని రాజ‌ధాని ఆసుప‌త్రిలో జరిగింది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ఫ్యాన్‌లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు అంటుకుని ఇత‌ర వార్డుల‌కు వ్యాపించాయ‌ని చెప్పారు. ఒకరు మంటల్లో చిక్కుకుని మరణించగా.. మరో ముగ్గురు కాలిన గాయాలతో చనిపోయారు. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ఆస్పత్రి యజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ‘బాధితులు కోవిడ్-19 పెషేంట్లు.. వారు గత కొద్ది రోజులుగా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది’ రాయ్‌పూర్ Raipur Superintendent of Police అజయ్ యాదవ్ తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకుని మంటలను అర్పేందుకు ప్రయత్నించారు. అలాగే ఆస్పత్రిలోని మిగిలిన కరోనా పెషేంట్లను ఇతర బిల్డింగ్‌లోకి తరలించారు. మ‌రోవైపు సీఎం భూపేశ్ భగేల్ ఈ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు.

Buxar Railway Station: షాకింగ్ వీడియో.. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీసిన ప్రయాణికులు.. కారణమిదే..

Indian Railways: రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త.. ఇలా చేస్తే మీ జేబుకు చిల్లే..

కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Chhattisgarh, Covid hospital, Crime news, Fire Accident

ఉత్తమ కథలు