హోమ్ /వార్తలు /క్రైమ్ /

Uttar Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం.. మంటల్లోనే మరికొందరు..

Uttar Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం.. మంటల్లోనే మరికొందరు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఓ బాణాసంచా గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రమాదంలో దాదాపు నలుగురు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.

  ఇటీవల దేశంలో రోజు రోజుకూ అగ్ని ప్రమాదాలు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా బాణాసంచా తయారీ కేంద్రాలు,  వాటిని నిల్వ చేసే గోదాముల్లో ఇలాంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల్లో పెట్టకూటి కోసం పనిచేయడానికి వచ్చిన అనేక మంది అగ్నికి ఆహుతులవుతున్నారు. ప్రమాదాల్లో కాలి బూడిద అవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఓ బాణాసంచా గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రమాదంలో దాదాపు నలుగురు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కప్తన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డు నంబర్ 11లో కొందరు అక్రమంగా బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు.

  ఎలాంటి అనుమతులు లేకుండానే జనావాసాల నడుమ బాణాసంచా తయారు చేస్తున్నారు. దీపావళి దగ్గరకు వస్తుండడంతో ప్రస్తుతం అక్కడ జోరుగా బాణాసంచా తయారీ సాగుతోన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే సారి అక్కడ పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు మంటల్లో చిక్కుకుని చనిపోయారు.

  అయితే ప్రమాదంలో మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. గాయాల పాలైన పలువురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నివాస గృహాల మధ్య, ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ బాణాసంచా తయారీ చేస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

  ఇటీవల మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఓ బోగి నుంచి మరో బోగికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమయిన ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు బయటకు తెలియలేదు. ప్రమాదానికి గురైన బోగీలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Fire Accident, Uttar pradesh

  ఉత్తమ కథలు