• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • 4 BOOKED FOR RAPING MINOR AFTER FAILED CONVERSION BID SAYS MADHYA PRADESH POLICE SU

మతం మారాలని మైనర్ బాలికపై ఒత్తిడి.. ఆమె వినకపోవడంతో ఫ్రెండ్స్‌తో కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి నకిలీ గుర్తింపుతో మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. మాయ మాటలతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.

  • Share this:
    ఓ వ్యక్తి మారు పేరుతో మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మతం మారాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. మతం మారేందుకు ఆమె నిరాకరించడంతో స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. వివరాలు.. బాధిత బాలిక స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని బార్వాని జిల్లా. అయితే బాలిక.. హారాష్ట్రలోని మాలెగావ్‌లో కూలీ పనులు చేసేందుకు వెళ్లింది. అక్కడ ఆమెకు 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను నకిలీ గుర్తింపుతో బాలికకు దగ్గరయ్యాడు. అతని పేరు మజీద్ ఖాన్ అయితే.. తన పేరు మోహిత్ అని బాలికకు చెప్పాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

    గతేడాది బాలికను ఇస్లాం మతంలోకి మార్చేందుకు మజీద్ ప్రయత్నించాడు. అయితే మతం మారేందుకు బాలిక నిరాకరించింది. దీంతో మజీద్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. ఆ తర్వాత బాలిక.. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. అయితే ఈ ఏడాది ఈ ఏప్రిలో బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె సోదరి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె గర్భవతి అని తేల్చారు. చాలా ముందుగా ప్రసవం జరగడంతో శిశువు మరణించిందని చెప్పారు.

    ఆస్పత్రిలో ఉన్న సమయంలో బాలిక.. తనపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి.. అక్కడే ఉన్న మరోక మహిళతో చెప్పింది. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని హిందూ సంఘాలకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ వివరాలను ఉజ్జయిని ఏఎస్పీ అమ్రేంద్ర సింగ్ వెల్లడించినట్టు హిందూస్తాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

    Hyderabad: వదిన అంటూ దగ్గరయి.. మహిళతో వివాహేతర సంబంధం.. వీరిద్దరు కలిసి ఎంత నీచమైన పని చేశారంటే..

    కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?

    ఆ పాకిస్తానీ కుటుంబం కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు కారణమం ఏమిటంటే..?

    ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలిక సాయంతో మజీద్‌ను ఉజ్జయినికి పిలిపించిన పోలీసులు.. అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసి అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్లతో పాటు, మధ్యప్రదేశ్ Freedom of Religion చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇక, బాలిక గర్భంలోనే మరణించిన శిశువు మృతదేహాపిరి పితృత్వ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిణ కోసం పంపారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన మిగిలిన ముగ్గురు ఆచూకీ లభించలేదు.
    Published by:Sumanth Kanukula
    First published: