39 మంది రేప్ చేశారు... పోలీసులకు మహిళ ఫిర్యాదు...

తనను 39 మంది అత్యాచారం చేశారంటూ 32 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: January 8, 2020, 7:45 PM IST
39 మంది రేప్ చేశారు... పోలీసులకు మహిళ ఫిర్యాదు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తనను 39 మంది అత్యాచారం చేశారంటూ 32 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనను గ్రామానికి చెందిన 39 మంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పెను దుమారానికి దారి తీసింది. వెంటనే అలర్ట్ అయిన ఎస్పీ కార్యాలయం సదరు గ్రామం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీసులను పిలిపించారు. అయితే, ఆ నోటా, ఈ నోటా విషయం గ్రామస్తులకు కూడా తెలిసింది. వెంటనే వారంతా వచ్చి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆమె తప్పుడు ఫిర్యాదు ఇస్తోందని ఆరోపించారు. ఆ మహిళ, ఆమె భర్త గ్రామానికి చెందిన కొందరి వద్ద రూ.2.50 లక్షలు అప్పులు తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం వల్లే ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు