ఆ లారీలో 39 మృతదేహాలు చైనావేనా..? మిస్టరీ వీడినట్లేనా?

39 Bodies Mystery : చాలా అంశాల్లో చైనా ప్రపంచ దేశాలకు సమాధానాలు దాటవేస్తోంది. తాజాగా 39 మృతదేహాల విషయంలోనూ ఇదే పంథా అనుసరిస్తోంది.

news18-telugu
Updated: October 25, 2019, 7:26 AM IST
ఆ లారీలో 39 మృతదేహాలు చైనావేనా..? మిస్టరీ వీడినట్లేనా?
ఆ లారీలో 39 మృతదేహాలు చైనావేనా..? మిస్టరీ వీడినట్లేనా?
  • Share this:
39 Dead Bodies Mystery : లండన్‌... ఎసెక్స్‌ లోని గ్రేస్‌ ప్రాంతంలో ఇటీవల ఓ లారీ కంటైనర్‌లో 39 మృతదేహాలు కనిపించాయి. అవన్నీ చైనా ప్రజలవేనని తెలిసింది. డెడ్ బాడీల్లో 38 మంది పెద్దవాళ్లున్నారు. ఒక టీనేజర్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అసలా లారీలోకి మృతదేహాలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచీ వచ్చాయి అన్నది తెలియట్లేదు. లారీ ఎవరిదో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు, ఇమిగ్రేషన్‌ అధికారులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ లారీని దగ్గర్లోని టిల్‌బరీ డాక్స్‌ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ మృతదేహాలకు సంబంధించి ఎవరైనా వస్తారా అని పోలీసులు చూస్తున్నారు. ఐతే... ఈ ఉదంతంపై చైనా ఇంకా మాట్లాడలేదు. చైనా ప్రతినిధులు ఏదైనా స్పష్టత ఇస్తే తప్ప... పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

ఆ లారీలో 39 మృతదేహాలు చైనావేనా..? మిస్టరీ వీడినట్లేనా?


స్థానిక విలేకరులు మాత్రం... లారీ డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడనీ, అతని ద్వారా విషయం తెలిసినా... పోలీసులు సస్పెన్స్ కొనసాగిస్తున్నారని అంటున్నారు. 2000 సంవత్సరంలో చైనాకు చెందిన 58 మంది మృతదేహాలను డచ్‌కు చెందిన లారీలో డోవర్‌ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు కూడా చైనా తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించింది. చైనాకు చెందిన వాళ్లనే ఎవరైనా టార్గెట్ చేసి చంపుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


Pics : హాట్ పకోడీలా అదరగొడుతున్న జినాల్ జోషీ




ఇవి కూడా చదవండి :

కర్తార్‌పూర్ అంటే ఏంటి? ఆ యాత్ర ఎలా చెయ్యాలి? కండీషన్లేంటి?మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ భయపడ్డారా... వ్యూహాత్మకంగా వ్యవహరించారా?

Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?

Published by: Krishna Kumar N
First published: October 25, 2019, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading