హోమ్ /వార్తలు /క్రైమ్ /

Convict : ఈ దోషికి 80 ఏళ్ల జైలు శిక్ష.. చేసిన నేరమేంటో తెలుసా?

Convict : ఈ దోషికి 80 ఏళ్ల జైలు శిక్ష.. చేసిన నేరమేంటో తెలుసా?

దోషి

దోషి

Crime News : ఓ సంచలన కేసులో వచ్చిన తీర్పు కూడా సంచలనం అయ్యింది. దోషికి ఏకంగా 80 ఏళ్ల జైలు శిక్ష వేయడం బాధితులకు ఒకింత ఊరట కలిగించింది. అతను చేసిన నేరమేంటో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Convict : నేరాలు చేసే చాలా మంది.. ఆ నేరం చేస్తే.. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? నేరం చేసినందుకు తనకు ఎలాంటి శిక్ష పడుతుంది? బాధితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇవేమీ ఆలోచించరు. తమ ఆవేశం కొద్దీ నేరం చేస్తారు. జీవితాన్ని జైలుపాలు చేసుకుంటారు. కేరళ.. మలప్పురంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 80 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించింది కోర్టు. 38 ఏళ్ల మంచెరి తానిపర కటకంచేరి నౌఫల్‌కి పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.రాజేష్‌ ఈ శిక్ష విధించారు.

2021లో నౌఫల్.. బాధిత బాలికను కిడ్నాప్ చేశాడు. ఊరి చివర్లో మనుషులు తిరగని ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో బాలికను గొలుసులతో బంధించాడు. అరిచినప్పుడల్లా కొడుతూ.. అరవాలంటేనే భయపడేలా చేశాడు. ఆ తర్వాత బాలికపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు చిత్రహింసలు పెట్టాడు. కొన్నాళ్లకు బాలిక ఎలాగొలా తప్పించుకోవడంతో... నేరం బట్టబయలైంది.

అత్యాచారాలతోపాటూ.. బాలికకు చిత్రహింసలు పెట్టినందుకు 20 ఏళ్ల కఠిన ఖారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా... అలాగే లైంగిక వేధింపుల సమయంలో బాలికను గాయపరిచినందుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా,... అలాగే 12 ఏళ్లలోపు బాలికను వేధించినందుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంకా కిడ్నాప్ చేసినందుకు 10 ఏళ్లు, ఇంట్లో బంధించినందుకు 10 ఏళ్లు ఇలా రకరకాల అంశాలన్నింటికీ కలిపి 80 ఏళ్ల శిక్ష పడింది. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం చెల్లించాలన్న కోర్టు.. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

First published:

Tags: Child rape, Crime news, Kerala, Minor rape

ఉత్తమ కథలు