Home /News /crime /

370 CAPSULES WITH 4 KG HEROIN FOUND IN STOMACHS OF 5 MEN CAUGHT AT DELHI AIRPORT BA

కడుపులో 370 డ్రగ్స్ ప్యాకెట్స్... వీడొక్కడే సినిమా రేంజ్‌లో స్మగ్లింగ్..

డ్రగ్స్ స్మగ్లింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

డ్రగ్స్ స్మగ్లింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

ఆ ఐదుగురికి ఎక్స్‌రే తీయగానే వారి కడుపులో డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్టు కనిపించింది. దీంతో అప్పటి నుంచి వైద్యులు వారి కడుపులో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను బయటకు తీయడం మొదలుపెట్టారు.

    తమిళ హీరో సూర్య నటించిన వీడొక్కడే సినిమా చూశారా? అందులో విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేయడానికి ఓ ముఠా చాలా డేంజరస్ ఐడియా వేస్తుంది. డ్రగ్స్‌ను ట్యాబ్లెట్ల తరహాలో తయారు చేసి, అవి కరిగిపోకుండా కవర్లో పెడతారు. చిన్న చిన్న క్యాప్సూల్స్‌ను మింగుతారు. కస్టమ్స్, పోలీసులకు ఎక్కడా దొరక్కుండా డ్రగ్స్‌ను సరఫరా చేస్తారు. ఈ ముఠా కూడా ఆ సినిమా చూసినట్టుంది. సేమ్ టు సేమ్ ట్రై చేశారు. అయితే, ఢిల్లీలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. సెప్టెంబర్ 14న కాందహార్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ విమానంలో ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారు స్మగ్లింగ్ చేస్తున్నారని కస్టమ్స్‌కు కచ్చితమైన సమాచారం వచ్చింది. అయితే, వారు ఏ బంగారాన్నో స్మగ్లింగ్ చేస్తున్నారని కస్టమ్స్ అధికారులు అనుకున్నారు. దీంతో వారు దిగిన వెంటనే సామగ్రి మొత్తం చెక్ చేశారు. మెటల్ డిటెక్టర్లతో పరిశీలించారు. కానీ, వారికి ఏమీ దొరకలేదు.

    లగేజీ బ్యాగ్స్‌లో ఏమీ దొరకలేదు కదా అని కస్టమ్స్ అధికారులు వదిలిపెట్టలేదు. వారు కూడా వీడొక్కడే సినిమా చూసినట్టున్నారు. ఆ ఐదుగురిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ ఐదుగురికి ఎక్స్‌రే తీయగానే వారి కడుపులో డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్టు కనిపించింది. దీంతో అప్పటి నుంచి వైద్యులు వారి కడుపులో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను బయటకు తీయడం మొదలుపెట్టారు. ఆ ఐదుగురి కడుపులో మొత్తం 370 ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటి బరువు సుమారు 4 కేజీలు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో ఆ హెరాయిన్ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు. ఢిల్ల ఎయిర్‌పోర్టులో ఇంత భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడడం ఇదే తొలిసారి. అయితే, కడుపులో హెరాయిన్ స్మగ్లింగ్ చేసి, ఢిల్లీలో ఉన్న ఓ వ్యక్తికి అందజేస్తే, వారికి ఒక్కొక్కరికి 500 అమెరికన్ డాలర్లు ఇస్తామని డీలర్ చెప్పినట్టు నిందితులు అంగీకరించారు.
    First published:

    Tags: Afghanistan, Drugs, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు