Fake TET Certificates : నకిలీ టెట్‌ సర్టిఫికెట్లతో టీచ‌ర్‌ ఉద్యోగం.. 36 మందిపై కేసు

ప్ర‌తీకాత్మ చిత్రం

ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగానికి కొంద‌రు న‌కిలీ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Teachers Eligibility Test) ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించి ఉద్యోగంలో చేరారు. ఇలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 36 మంది చేరారు. ఇలా చేరిన వారిని గుర్తించి వారిపై పోలీసులు (Police) కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న అస్సాం (Assam) రాష్ట్రంలో జ‌రిగింది. 

  • Share this:
    ప్ర‌భుత్వ ఉద్యోగం (Govt Jobs) సంపాదించాలంటే ఎంత క‌ష్ట‌మో అంద‌రికీ తెలుసు.. చాలా మంది ఏళ్ల‌కు ఏళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దువుతారు. అయితే కొంద‌రు వెళ్లే త‌ప్పుడు మార్గాల ద్వారా అల‌సైన అభ్య‌ర్థుల‌కు న‌ష్టం జ‌రుగుతోంది. దీని ద్వారా అర్హ‌త క‌లిగి ఏళ్లకు ఏళ్లు చ‌దివిన వారు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు దూరం అవుతున్నారు. ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగానికి కొంద‌రు న‌కిలీ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Teachers Eligibility Test) ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించి ఉద్యోగంలో చేరారు. ఇలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 36 మంది చేరారు. ఇలా చేరిన వారిని గుర్తించి వారిపై పోలీసులు (Police) కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న అస్సాం (Assam) రాష్ట్రంలో జ‌రిగింది.

    న‌కిలీ టెట్ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించిన వారిని పోలీస్‌ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీం (Special Investigation Team) గుర్తించింది. ఈ 36 మంది బోడోలాండ్ టెరిట‌రీ రీజియ‌న్‌ (Bodoland Territorial Region)కు చెందిన చిరాంగ్, బక్సా, ఉదల్‌గురి, కోక్రాజార్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామ‌ని పోలీస్ అధికారి తెలిపారు. నకిలీ, త‌య‌రు చేసిన ధ్రువ ప‌త్రాల‌తో వారు ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌ను పొందిన‌ట్టు గుర్తించామ‌ని వెల్ల‌డించారు.

    36 మంది త‌యారు చేసిన ప‌త్రాల‌తో బోడోలాండ్ టెరిట‌రీ రీజియ‌న్ ఉద్యోగాలు పొందిన‌ట్టు పోలీసులు తెలిపారు.

    SBI PO Recruitment 2021 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐలో 2056 పీఓ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌


    వీరిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ప‌రిశీలించ‌డానికి ప్రాథ‌మిక విచార‌ణ నిర్వ‌హించిన‌ట్టు పోలీసులు తెలిపారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లోనే వీరి త‌ప్పు బ‌య‌ట ప‌డింద‌ని వెల్ల‌డించారు. దీనిపై స్పందించిన ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శర్మ ఉపాధ్యాయుల‌పై కేసు న‌మోదు చేసి పూర్తిస్థాయి ద‌ర్యాప్తు చేప‌ట్టాని సీఐడీని ఆదేశించారు.

    అక్టోబ‌ర్ 3, 2021 వీరిపై కేసు న‌మోదంద‌ని పోలీసు అధికారి తెలిపారు. అనంత‌రం ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని అన్నారు. నిందితుల ఆచూకీ కోసం వెతికామ‌ని అన్నారు. కొంద‌రిని ఇప్ప‌టికే అదుపులోకి తీసుకొని సీఐడీ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకొచ్చామ‌ని తెలిపారు. మ‌రికొంద‌రు ప‌రారీలో ఉన్న‌ట్టు గుర్తించామ‌న్నారు. త్వ‌ర‌లోనే వారి ఆచూకీని ప‌ట్టుకొంటామ‌న్నారు.

    టెట్ అంటే..
    ప్ర‌భుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయ పోస్టులు కోరుకునేవారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వేలిడిటీ-TET క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని, టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ ఏడేళ్లు ఉంటుంది. ఇక‌ప దీన్ని జీవితకాల‌ని పెంచుతున్నారు. టెట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా నిర్వ‌హిస్తోంది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో సీటెట్‌ని కేంద్రం నిర్వ‌హిస్తోది. సీ టెట్ పాసైన వారు కూడా అన్ని ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ టెట్ ప‌రీక్ష‌నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తారు.
    Published by:Sharath Chandra
    First published: