Home /News /crime /

35 YEAR OLD ANGANWADI FEMALE EMPLOYEE GOES MISSING WITH 10TH CLASS SCHOOL STUDENT SSR

35 Year Old Woman: ఈమెకు ఇదేం పాడు బుద్ధి.. ఎవరైనా ఇలాంటి పని చేస్తారా.. ఇలాంటివి ఇంకెన్ని చూడాలో..

నిందితురాలు లలిత (ఫైల్ ఫొటో)

నిందితురాలు లలిత (ఫైల్ ఫొటో)

ఆ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. 35 ఏళ్ల మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. కొన్ని రోజులకు ఇద్దరూ ఇరు కుటుంబాలకు ఊహించని షాక్ ఇచ్చారు.

  ఆ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. 35 ఏళ్ల మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. కొన్ని రోజులకు ఇద్దరూ ఇరు కుటుంబాలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో జరిగింది.

  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువారూర్ జిల్లాలోని కూడవాసల్ తాలూకాలో బాలగురు, రసతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకు స్కూల్‌కు వెళ్లే వయసున్న కొడుకూ, కూతురు ఉన్నారు. ఈ కుటుంబం నివాసం ఉంటున్న వీధిలోనే లలిత(35), బాలకృష్ణన్ అనే భార్యాభర్తలు ఉంటున్నారు. వీళ్లకు 13 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. బాలకృష్ణన్ తాపీ పనికి వెళుతుండేవాడు. లలిత అంగన్వాడీ స్కూల్‌లో వంట మనిషిగా పనిచేస్తుండేది. బాలగురు 15 ఏళ్ల కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ అబ్బాయికి, లలితకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి వెళ్తూ వస్తూ ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉండటంతో ఎవరూ తప్పుగా అనుకునే వారు కాదు. కానీ.. వీళ్లిద్దరూ ఎవరికీ తెలియకుండా శారీరక సంబంధాన్ని కొనసాగించారు.

  వీళ్లిద్దరి వివాహేతర సంబంధం గురించి కొన్నాళ్లకు బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. అప్పటి నుంచి కొడుకును లలితకు దూరంగా ఉంచాలని పక్క ఊరిలో ఉన్న ఆ బాలుడి అత్త వాళ్లింట్లో ఉంచి అక్కడి నుంచి స్కూల్‌కు వెళ్లి అత్త ఇంట్లోనే ఉండాలని తల్లిదండ్రులు చెప్పారు. ఆ బాలుడు కొన్నాళ్ల నుంచి అతని అత్త వాళ్ల ఇంటి నుంచే స్కూల్‌కు వెళుతున్నాడు. అయితే.. ఇలా వెళుతున్న ఆ బాలుడు గత నెల 26న స్కూల్‌కు వెళ్లి తిరిగి ఎంతసేపటికీ ఇంటికి వెళ్లలేదు. దీంతో.. అబ్బాయి స్కూల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని.. ఎక్కడ వెతికినా కనిపించలేదని అతని అత్త వాళ్ల కుటుంబం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

  ఇది కూడా చదవండి: BDS Student: సోషల్ మీడియా పరిచయం ఎంతపని చేసిందో చూడండి.. మానస కేసులో తాజా అప్‌డేట్ ఇదే..

  ఆ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఆ బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో.. బాలుడి తండ్రి బాలగురు ఎరవంచేరి పోలీస్ స్టేషన్‌లో తమ కొడుకు కనిపించకుండాపోయాడంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎవరిపై అయినా అనుమానం ఉందా అని బాలగురును అడగ్గా.. తన కొడుకు లలిత అనే ఓ పెళ్లైన మహిళతో చనువుగా ఉండేవాడని.. ఆంటీ.. ఆంటీ అని తమ వీధిలోనే ఉండే వాళ్లింటికి వెళుతూ ఉండేవాడని చెప్పాడు. కొన్నాళ్లకు వాళ్లిద్దరి అఫైర్ గురించి తెలిసి ఆ మహిళకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో అతనిని అత్త ఇంటికి పంపించి అక్కడి నుంచి స్కూల్‌కు వెళ్లాలని చెప్పినట్లు బాలగురి పోలీసులకు తెలిపాడు. పోలీసులు లలిత గురించి విచారించగా ఆమె కూడా కనిపించకుండాపోయినట్లు తెలిసింది. పోలీసులు ఈ కేసును లోతుగా విచారించగా ఆ బాలుడు, లలిత కలిసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

  ఇది కూడా చదవండి: Shameful Incident: కూతురు 9 నెలల నిండు గర్భంతో పుట్టింట్లో ఉంటే ఒక తల్లి చేయాల్సిన పనా ఇది..

  ఆ బాలుడు స్కూల్ అవ్వగానే లలితతో కలిసి ఓ ఆటోలో వెళ్లిపోయినట్లు పోలీసులు తేల్చారు. ఆటో డ్రైవర్‌గా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ‘పూన్‌తొట్టం’ అనే గార్డెన్‌ దగ్గర వాళ్లిద్దరినీ ఆటోలో వదిలిపెట్టానని.. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లారన్నది తనకు తెలియదని ఆటో డ్రైవర్ విచారణలో చెప్పాడు. లలిత ఫోన్ నంబర్ రెండు సార్లు రింగ్ కావడం, ఆ తర్వాత స్విచ్‌ ఆఫ్ రావడంతో ఆమె మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఇద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయాన్నే తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. కొడుకు వయసున్న వ్యక్తితో లలిత వెళ్లిపోవడం, 13 ఏళ్ల కూతురి గురించి కనీసం ఆలోచించకుండా క్షణిక సుఖం మోజులో ఇలా చేయడంతో ఆమె భర్త తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. మైనర్‌ను తీసుకుని వెళ్లిపోయినందుకు లలితపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Anganwadi, Extra marital affair, Love affair, Student, Tamilnadu, WOMAN

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు