కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చెలామణిలోకి వచ్చిన భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెల్మెట్ ధరించలేదని రూ.34 వేలు జరిమానా విధించడం సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకేలా ఉంటుందా అని వాహనదారులు భయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే రాంచీకి చెందిన రాకేష్ కుమార్ ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ట్రాఫిక్ సిబ్బంది కంటపడగా, వాళ్లు ఏమాత్రం మొహమాట పడకుండా సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం రూ.34 వేల జరిమానా విధించారు. హెల్మెట్‌తో పాటు ఇతర నిబంధనలు కూడా అతిక్రమించడంతోనే ఇంత భారీ జరిమానా విధించాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: TRAFFIC AWARENESS, Traffic challans, Traffic police, Traffic rules