మహిళపై 9 మంది గ్యాంగ్ రేప్.. వాహనంలో నుంచి కింద పడేసి...

ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బంధువుల బాలికను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్న 32 ఏళ్ల మహిళ మీద కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

news18-telugu
Updated: September 26, 2019, 10:40 PM IST
మహిళపై 9 మంది గ్యాంగ్ రేప్.. వాహనంలో నుంచి కింద పడేసి...
ప్రతీకాత్మకచిత్రం
news18-telugu
Updated: September 26, 2019, 10:40 PM IST
ఓ మహిళపై తొమ్మిది మంది కామాంధులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశారు. కదులుతున్న వాహనంలో ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను నడిరోడ్డుమీద విసిరేసి పారిపోయారు. ఈ ఘటన త్రిపురలోని అగర్తలాలో జరిగింది. అగర్తలాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బంధువుల బాలికను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్న 32 ఏళ్ల మహిళ మీద కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గత మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద పడి ఉన్న మహిళలు స్థానికులు గుర్తించి ఆమెను జీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, అయితే, చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు తూర్పు అగర్తలాలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో బాలికను పరామర్శించిన తర్వాత రాత్రి 7.30గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఓ తెలిసిన వ్యక్తి ఆటో ఎక్కింది. అయితే, అతడు వేరే మార్గంలో వెళ్తుండడంతో అతడిని ప్రశ్నించింది. అయితే, తాను మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకునేందుకే ఈ మార్గంలో వెళ్తున్నానని చెప్పాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆటోలో నలుగురు యువకులు ఎక్కారు. ఏదో కీడు జరుగుతుందని ఆమె శంకించింది. అయితే, వారు ఆటో ఎక్కిన వెంటనే ఆమె నోరు నొక్కేశారు. చేతులు, కాళ్లు కట్టేశారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆమెను ఓ కారులోకి మార్చారు. నర్సింగఢ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో నలుగురు యువకులు కాచుకుని కూర్చున్నారు. వారు కూడా కారులోకి ఎక్కారు. సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రాత్రి 11.30 గంటల సమయంలో ఆమెను రోడ్డు మీదకు తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...