కత్తితో దాడి చేసి, సూట్‌కేస్‌లో కుక్కి... ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతీరెడ్డి దారుణ హత్య...

మెల్‌బోర్న్‌లో ఓ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన NRI ప్రీతీరెడ్డి... ఆమె బాయ్‌ఫ్రెండ్ హర్షవర్థన్ నార్డేనే, ప్రీతీరెడ్డి చంపి, ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు....

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 7, 2019, 10:18 AM IST
కత్తితో దాడి చేసి, సూట్‌కేస్‌లో కుక్కి... ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతీరెడ్డి దారుణ హత్య...
ప్రీతిరెడ్డి ఫోటో (Photo: Twitter)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 7, 2019, 10:18 AM IST
ఆస్ట్రేలియాలో గత ఆదివారం కనిపించకుండా పోయిన తెలుగు యువతి, డెంటిస్ట్ ప్రీతీరెడ్డి దారుణహత్యకు గురైంది. మెల్‌బోర్న్‌లోని సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన NRI ప్రీతీరెడ్డి... మళ్లీ కనిపించలేదు. చివరిసారిగా ఆదివారం రోజు (మార్చి 3) కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రీతీరెడ్డి... రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. అయితే రాత్రి ఎంతసేపటికీ ఆమె రాకపోవడం...ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు... ఆమె కేసు సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా గాలించారు.
preeti Reddy Dentist, Indian-origin Dentist Preeti Reddy murder, Preeti Reddy killed in Australia, Body found in Suitcase, Dentist Preeti Reddy missing Case, Ex-boyfriend of Preeti Reddy, Preeti Reddy murder case in Australia, McDonald's in George Street Australia, Strachan lane in Kingsford, Body found inside the Case, NSW Police, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి,ప్రీతిరెడ్డి హత్య, ఆస్ట్రేలియాలో తెలుగు యువతి డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, ప్రీతిరెడ్డి మర్డర్ న్యూస్, ప్రీతిరెడ్డి బాయ్‌ఫ్రెండ్ హత్య యాక్సిడెంట్, ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు
ప్రీతీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు (Photo: twitter)

తాజాగా ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సిడ్నీలోని సౌత్ వేల్స్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే ఓ సూట్‌కేసులో కుక్కి, వదిలివెళ్లారు దుండగులు. ఆమె మృతదేహాంపై ఉన్న గాయాలను బట్టి కత్తితో దాడి చేసి చంపినట్టు నిర్ధారించారు పోలీసులు. ప్రీతీరెడ్డి మృతదేహం దొరికిన తర్వాతి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్షవర్థన్ నార్డే... రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె చివరి సారిగా కనిపించిన మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ సమీపంలో ప్రీతీరెడ్డితో పాటు హర్షవర్థన్ కూడా ఉన్నట్టు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఏమైంది... ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన తర్వాత రోజే హర్షవర్థన్‌కు ఎలా యాక్సిడెంట్ అయ్యిందనే విషయాలు మిస్టరీగా మారాయి.

preeti Reddy Dentist, Indian-origin Dentist Preeti Reddy murder, Preeti Reddy killed in Australia, Body found in Suitcase, Dentist Preeti Reddy missing Case, Ex-boyfriend of Preeti Reddy, Preeti Reddy murder case in Australia, McDonald's in George Street Australia, Strachan lane in Kingsford, Body found inside the Case, NSW Police, డెంటిస్ట్ ప్రీతిరెడ్డి,ప్రీతిరెడ్డి హత్య, ఆస్ట్రేలియాలో తెలుగు యువతి డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, ప్రీతిరెడ్డి మర్డర్ న్యూస్, ప్రీతిరెడ్డి బాయ్‌ఫ్రెండ్ హత్య యాక్సిడెంట్, ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు
సీసీటీవీలో చివరిసారిగా కనిపించిన ప్రీతీరెడ్డి (Photo: twitter)

సీడ్నిలోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ హోటెల్‌లో ఆదివారం హర్షవర్థన్‌తో కలిసి ప్రీతీరెడ్డి బస చేసిందని... ఆ తర్వాత సెయింట్ లియోనార్డ్స్‌లో కాన్ఫిరెన్స్‌కు అటెండ్ అయ్యిందని.... ఆ తర్వాత చివరి సారిగా మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌లో కనిపించిదని పోలీసులు తెలిపారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ హర్షవర్థన్ నార్డేనే, ప్రీతీరెడ్డి చంపి, ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రీతీరెడ్డి మృతదేహాం పోలీసులకు దొరకడంతో తాను దొరికిపోతాననే భయంతో అతివేగంతో కారును నడిపి, యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటాడని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే కానీ, అసలు నిజాలు తెలియవు. ప్రీతీరెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామం.

First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...