31 Dead In Nigeria Church Food Event : ఓ చర్చి నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ నగరంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ నగరంలో కింగ్స్ అసెంబ్లీ చర్చి స్థానిక పోలో క్లబ్లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించిందని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె తెలిపారు. దీనికి చాలా ముందుగానే ప్రచారం చేశారు. శనివారం ఉదయం ఆహారంతోపాటు, బహమతులు పంపిణీ చేశారు. దీంతో ఆహారం, బహుమతులు తీసుకునేందుకు అంచనాలకు మించి వందల మంది తరలివచ్చారు. చాలామంది తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు.
అయితే, ఎంతసేపటికీ తమ వంతు రాకపోవడం, జనం పెరిగిపోవడంతో తోపులాట జరిగింది.చాలా మంది గేట్లు పగులగొట్టుకుని లోపలికి చొచ్చుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 31 మంది మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చర్చికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తొక్కిసలాట జరిగేటప్పటికీ గిఫ్టుల పంపిణీ ప్రారంభం కాలేదని పోలీసులు తెలిపారు. గేటు మూసి ఉన్నప్పటికీ జనాలు దూసుకొచ్చారని చెప్పారు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.
ALSO READ Smart watch : అదిరిపోయే ఫీచర్లతో...అంధుల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ వాచ్
మరోవైపు,తమిళనాడు(Tamilnadu)లో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. అప్పుల భారంతో ఓ వ్యక్తి..తన భార్య మరియు ఇద్దరు పిల్లల గొంతు కోసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని పోలీసులు శనివారం తెలిపారు. తమిళనాడులోని చెన్నై సబర్బన్ పొలిచలూరులో 41 ఏళ్ల ప్రకాష్ కి.. భార్య గాయత్రి (35), కుమారుడు హరికృష్ణన్ (11), కుమార్తె నిత్యశ్రీ (9) ఉన్నారు. ఆయుర్వేద మందుల దుకాణం నడుపుతున్న ప్రకాష్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాడు. చేసిన అప్పులు తలకు మంచిన భారంగా మారాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ విషయంలో తరచూ ప్రకాష్అతడి భార్య మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రకాష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. రంపం కోసే యంత్రంతో భార్య,పిల్లలను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.