Home /News /crime /

300 STITCHES IN 4 HOURS SAVE MANS FACE MAULED BY BEAR GH VB

Bear Attack: ఎలుగుబంటి దాడి.. ఛిద్రమైన ముఖం.. 4 గంటల్లో 300 కుట్లు.. అసలేం జరిగిందంటే..

ఆసుపత్రిలో వైద్యులు

ఆసుపత్రిలో వైద్యులు

గుజరాత్ రాష్ట్రం, ఛోటా ఉదేపూర్‌ సిటీ, పావిజేత్‌పూర్ తాలూకాలోని అంబాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ రథ్వా (26) జనవరి 1న గ్రామ పొలంలో బహిర్భూమికి వెళ్లాడు. ఈ సమయంలోనే ఒక ఎలుగుబంటి అతడిపై విరుచుకుపడింది.

ఇటీవలే ఓ ఎలుగుబంటి (Bear) దాడిలో ఓ యువకుడి ముఖం పూర్తిగా ఛిద్రమైంది. అది యువకుడి ముఖభాగాలన్నీ గుర్తుపట్టలేనంతగా కోరికేసింది. అయితే అందవికారంగా, వికృతంగా మారిన అతని ముఖాన్ని సరిచేసేందుకు వడోదరలో(Vadodara)ని ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రి (SSG Hospital) సర్జన్లు కీలకమైన శస్త్రచికిత్స చేశారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ సర్జరీలో డాక్టర్లు యువకుడి ముఖానికి ఏకంగా 300 కుట్లు (Stitches) వేసి, అతని ముఖాన్ని మళ్లీ పునర్నిర్మించారు. వాస్తవానికి ప్రభుత్వేతర ఆసుపత్రుల్లో(Hospitals) ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియకు రూ.లక్షల్లో డబ్బు అడుగుతారు. కానీ ఎస్‌ఎస్‌జీ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఉచితంగా సర్జరీ చేసి బాధితుడికి పెద్ద ఊరట కలిగించారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం, ఛోటా ఉదేపూర్‌ సిటీ, పావిజేత్‌పూర్ తాలూకాలోని అంబాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ రథ్వా (26) జనవరి 1న గ్రామ పొలంలో బహిర్భూమికి వెళ్లాడు.

ఈ సమయంలోనే ఒక ఎలుగుబంటి అతడిపై విరుచుకుపడింది. ఈ భయంకరమైన దాడిలో అతడి ముక్కు, ఎముకలు, కండరాలు, పెదవులు, కింది కనురెప్పలు, బుగ్గలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు కలిసి గాయపడిన రథ్వాను వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రికి తరలించారు. ముఖ జాడలు కనిపించలేనంతగా అతని ఫేస్‌లో మూడింట ఒక వంతు బాగా దెబ్బతిన్నది.

Electric Vehicles: జోరుగా సేల్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్​లు.. ఈవీలపై ఎందుకంత క్రేజ్..?


“ధర్మేష్‌ను మా వద్దకు తీసుకొచ్చినప్పుడు, అతని ముఖం నిండా విత్తనాలు, దుమ్ము, ఆకులు, రాళ్లు ఉన్నాయి. ఆ సమయంలో మేం అతని ఆరోగ్య పరిస్థితి విషమించకుండా త్వరితగతిన స్టెబిలైజ్ చేయాల్సి వచ్చింది. అలాగే రేబిస్, టెటానస్, యాంటీబయాటిక్ షాట్‌లను అందించాం. ముఖాన్ని పునర్నిర్మించే శస్త్రచికిత్స చేయడానికి ముందు అతనికి సీటీ-స్కాన్ నిర్వహించాల్సి వచ్చింది” అని ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి, ఎస్‌ఎస్‌జీ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శైలేష్ కుమార్ సోని తెలిపారు.

ఆ తర్వాత డాక్టర్ సోనీతో సహా డా.భాగ్యశ్రీ దేశ్‌మాంకర్, డా.నలిన్ ప్రజాపతి, డా.సుదర్శన్ యాదవ్, డా.రిద్ధి సోంపురాలతో కూడిన రెసిడెంట్ వైద్యుల బృందం నాలుగు గంటల పాటు 300 కుట్లు వేసి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. ధర్మేష్ ముక్కు నిర్మాణం పూర్తిగా దెబ్బతినడంతో ఇది సవాలుతో కూడిన శస్త్రచికిత్సగా మారింది. దీంతో సర్జరీ కొనసాగినంత వరకు ధర్మేష్ ని అపస్మారక స్థితిలో ఉంచడానికి డా.కవితా లాల్‌చందానీ, డా.నేహా షా, డా.రిమా గోమేటిలతో కూడిన మత్తుమందుల బృందం అక్కడే ఉండిపోయింది.

"మేం ఎలుగుబంటి నుజ్జునుజ్జు చేసిన ధర్మేష్ ముఖభాగాల నుంచి కొన్ని భాగాలను రికవరీ చేశాం. మిగిలిన వాటిని మేం ముఖాన్ని పునర్నిర్మించడానికి టైటానియం ప్లేట్లు, మెష్‌లను ఉపయోగించాం. ఎముకలలోని అన్ని భాగాలను రీకనెక్ట్ చేయడం ఒక పజిల్ పూర్తి చేసినట్లు అనిపించింది. సరైన ఎముకలు లేదా బోనీ సపోర్టు లేని చోట్ల టైటానియం ప్లేట్లు పెట్టాం. శ్వాసనాళం నుంచి పూర్తిగా విడిపోయిన ముక్కుకు ఆకారం ఇచ్చిన తర్వాత, నాసికా రంధ్రాలను శ్వాసనాళంతో కుట్టడం జరిగింది” అని డాక్టర్ శైలేష్ కుమార్ వివరించారు.

Sankranthi Offer: యాపిల్​ లవర్స్​కు సంక్రాంతి ఆఫర్.. ఆ ఐఫోన్ సిరీస్ పై భారీ డిస్కౌంట్..​


"రోగి మెడ, నుదిటి, స్కాల్ప్ నుంచి మృదు కణజాలాలను ఒలిచి (flap) స్కిన్ కవర్‌పై చర్మభాగంగా ఉపయోగించాం. అదృష్టవశాత్తూ, తగినంత మృదు కణజాలాలు ఉన్నాయి. ఇవి ముఖాన్ని ఒకదానితో ఒకటి జతచేయడానికి ముఖానికి సరైన పనితీరుని.. ఆకృతిని అందించడానికి ఉపయోగపడతాయి" అని సర్జన్ శైలేష్ కుమార్ చెప్పారు.

ధర్మేష్ రథ్వా ఇప్పుడు తన కళ్లను కదిలించగలుగుతున్నాడని.. ప్రస్తుతం ద్రవాహారం తీసుకుంటున్నాడని.. శ్వాస తీసుకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని.. రాబోయే రెండు రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.
Published by:Veera Babu
First published:

Tags: Crime

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు