• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 30 YEAR OLD WOMAN DEAD FALLS FROM DELHI FLYOVER HIT BY CAR

ఢిల్లీలో రోడ్డు ప్రమాదం... ఫ్లైఓవర్ పై నుంచి పడి మహిళ మ‌ృతి

ఢిల్లీలో రోడ్డు  ప్రమాదం... ఫ్లైఓవర్ పై నుంచి పడి మహిళ మ‌ృతి

ప్రతీకాత్మక చిత్రం

పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో ఓ వివాహ కార్యక్రమానికి భార్యభర్తలు వెళ్లారు. ఫంక్షన్ అయిపోవడంతో ఇంటికి తిరుగు పయనమయ్యారు

  • Share this:
    ఢిల్లీలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి బైక్‌పై వస్తున్న ఓ జంటను కారు ఢీకొట్టింది. ఈఘటనలో భార్య చనిపోగా భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలోని బరపుల ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో ఓ వివాహ కార్యక్రమానికి భార్యభర్తలు వెళ్లారు. ఫంక్షన్ అయిపోవడంతో ఇంటికి తిరుగు పయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్ ... బరపుల ఫ్లైఓవర్‌పైకి రాగానే... ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య ప్లైఓవర్ పై నుంచి ఎగిరి కింద పడింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

    దీంతో ఫ్లైఓవర్ కింద డ్రైనేజీలో పడిన బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికీ ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు భర్త తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారును 68 ఏళ్ల రిటైర్ట్ ఎయిర్ ఫోర్స్ అధికారి నడిపినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల అయ్యారన్నారు.
    First published:

    అగ్ర కథనాలు