Home /News /crime /

30 YEAR OLD WOMAN COMMITS SUICIDE AS LOVER REJECTS MARRIAGE PROPOSAL IN HYDERABAD MKS

Hyderabad : పాపం పవిత్ర.. పెళ్లి చేసుకోవడం లేదనే మనస్తాపంతో అలా చేసిందే!

మృతురాలు పవిత్ర

మృతురాలు పవిత్ర

ఆధునిక జీవనశైలి పట్ల ఇద్దరికీ అభిప్రాయాలు కుదిరడంతో నగరంలోనే సహజీవనం మొదలుపెట్టారు.. రోజులు.. నెలలు.. అలా ఏడాదికిపైగానే వారి సహజీవనం సాగింది.. పెళ్లెప్పుడంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తూ పోయాడతను.. ఎంతో నమ్మకంతో సహజీవనం చేస్తే, ఎంతకీ పెళ్లి చేసుకోవడంలేదనే మనస్తాపంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
ఆ అమ్మాయి, అబ్బాయి కాలేజీలో స్నేహితులు.. కాల క్రమంలో విడిపోయారు.. లైఫ్ లో సెటిల్ అవుతోన్న దశలో మళ్లీ సోషల్ మీడియా వేదికగా కలుసుకున్నారు.. ఆ రీ-యూనియన్ ప్రేమకు దారి తీసింది.. ఇద్దరూ ఉద్యోగలు చేసేవాళ్లే కావడంతో పెళ్లికి పెద్ద అడ్డంకులు ఉండవని భావించారు.. పెద్దలను ఒప్పించాలనుకున్నారు.. కానీ కుదరలేదు.. అబ్బాయి తల్లిదండ్రుల్ని ఎదురించి ఇంట్లో నుంచి వచ్చేశాడు.. ఆధునిక జీవనశైలి పట్ల ఇద్దరికీ అభిప్రాయాలు కుదిరడంతో నగరంలోనే సహజీవనం మొదలుపెట్టారు.. రోజులు.. నెలలు.. అలా ఏడాదికిపైగానే వారి సహజీవనం సాగింది.. పెళ్లెప్పుడంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తూ పోయాడతను.. ఎంతో నమ్మకంతో సహజీవనం చేస్తే, ఎంతకీ పెళ్లి చేసుకోవడంలేదనే మనస్తాపంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి కేపీహెచ్‌బీ కాలనీ సీఐ కిషన్‌కుమార్‌ తెలిపిన వివరాలివి..

ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్‌ (32), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండ పవిత్ర (30) ఖమ్మం పట్టణంలో బీ-ఫార్మసీ చదువుతున్నప్పుడు స్నేహితులుగా మారారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లు విడిపోయారు. ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ చేరిన తర్వాత మళ్లీ ఫేస్‌బుక్‌ ద్వారా టచ్ లోకి వచ్చారు. మునుపటికంటే మెచ్యూరిటీ పెరగడంతో వారి మధ్య పరిచయం ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ప్రేమ విషయం చెప్పగా, అమ్మాయి కుటుంబీకులు సరేనన్నారు కానీ, అబ్బాయి ఫ్యామిలీ నుంచి వ్యతిరేకత వచ్చింది.

Hyderabad : వామ్మో, ఇదేం చలి!! రికార్డు బద్దలు.. 10ఏళ్లలో అత్యంత చలిరోజు.. ఇక ముందు గజగజేపవిత్రతో గౌతమ్ పెళ్లికి అతని కుటుంబీకులు అంగీకరించలేదు సరికదా, అమ్మాయితో గౌతమ్‌కు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర ఆ పెళ్లిని అడ్డుకుంది. తర్వాత గౌతమ్‌, పవిత్రలు కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి హైదరాబాద్ లోనే కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో కలిసి జీవించసాగారు. అయితే, పెళ్లి విషయాన్ని గౌతమ్‌ పదే పదే దాటేస్తుండటం, ఏడాది గడిచినా కచ్చితమైన నిర్ణయానికి రాకపోవడంతో పవిత్ర ఒత్తిడి పెంచింది. ఈక్రమంలో..

Hyderabad : ప్రియుడితో వివాహిత రాసలీలలు చూసి మూడో వ్యక్తి బ్లాక్ మెయిల్.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్టులు..సహజీవనం చేస్తోన్న గౌతమ్, పవిత్రల మధ్య పెళ్లి విషయంలో వాదోపవాదాలు పెరిగాయి. శుక్రవారంనాడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. గౌతమ్ పెళ్లి చేసుకోవడంలేదనే మనస్తాపంతో పవిత్ర తీవ్ర నిర్ణయం తీసుకుంది. వాళ్లుంటోన్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణవార్త విని పవిత్ర తండ్రి నారాయణ హైదరాబాద్ వచ్చి శనివారం కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పవిత్రను గౌతమ్‌ మోసం చేశాడని, అతడి తల్లిదండ్రులు కూడా పవిత్రను వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Women suicide

తదుపరి వార్తలు