ఆ రాత్రి వాళ్లిద్దర్నీ ఆ పొజిషన్‌లో చూశాడు... ఆ తర్వాత ఏమైందంటే...

డ్యూటీ పూర్తయ్యక... ఆ రాత్రి రవీందర్ ఇంటికి వచ్చాడు. డోర్ తీయగానే... వాళ్లిద్దర్నీ అలా చూసి షాకయ్యాడు... అంతే... జరగరాని ఘోరం జరిగిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 28, 2019, 8:07 AM IST
ఆ రాత్రి వాళ్లిద్దర్నీ ఆ పొజిషన్‌లో చూశాడు... ఆ తర్వాత ఏమైందంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఢిల్లీలోని న్యూ అశోక్ విహార్... అక్కడి ఓ ఫ్లాట్‌లో తల్లిని చూసుకుంటూ నివసిస్తున్నాడు ఉత్తరప్రదేశ్‌కి చెందిన 30 ఏళ్ల రవీందర్ పాథక్. వీళ్లకు తోడుగా... తల్లికి ఫ్రెండ్‌లా అజిత్ కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. రవీందర్ పాథక్... నోయిడాలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు రాత్రి డ్యూటీ ముగిశాక... ఇంటికి వచ్చాడు. డోర్ తీసి లోపలికి వెళ్లబోయాడు. ఆ సమయంలో... తన తల్లి, అజిత్‌ని అభ్యంతరకర పొజిషన్‌లో చూసి షాకయ్యాడు. ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. రేయ్... అంటూ అజిత్‌పైకి ఉరికాడు. ఇద్దరి మధ్యా భీకరపోరు జరిగింది. ఇద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. వెంటనే తలుపు మూసేసిన తల్లి అటూ ఇటూ చూసింది. అక్కడో ఇటుక ఆమె కంట పడింది.

తను చేస్తున్నది తప్పా, ఒప్పా అన్నది ఆ తల్లి ఆలోచించలేదు. ఆ హడావుడిలో... గట్టిగా అరుస్తూ... అజిత్‌ని చితకబాదుతున్న కొడుకు తలపై ఇటుకతో గట్టిగా ఒక్కటిచ్చింది. అది సరిగ్గా మెదడు భాగంలో తగిలి... తల బద్ధలై... రక్తం కారుతుంటే... విలవిలలాడుతూ... తల్లివైపు దీనంగా చూస్తూ... ప్రాణాలు విడిచాడు 30 ఏళ్ల రవీందర్. అంతా అయిపోయినా... డ్రామా నడిపేందుకు అజిత్... అంబులెన్స్‌కి కాల్ చేశాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ అమాయకుడేమీ కాదు. ఆ రక్తం, గాయం అంతా చూశాక... రవీందర్ చనిపోయాడని అతనికి అర్థమైంది. పోలీసులకు కాల్ చేశాడు.


పోలీసులు వస్తే కొంప మునుగుతుందనుకున్న ఆమె... వెంటనే తన కొడుకు శవాన్ని... అజంపూర్‌లోని తన కూతురు దగ్గరకు తీసుకెళ్లింది. హడావుడిగా అంత్యక్రియలు జరపాలని చూసింది. ఏదో తేడా కొడుతోందని భావించిన కూతురు... తన తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు. తిరిగి ఢిల్లీలోని అశోక్ విహార్‌కే పంపింది. అప్పటికే అక్కడున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అజీత్‌ అప్పటికే అరైస్టై జైల్లో ఉన్నాడు.

 Video: పంజాబ్ సింగర్‌పై నోట్ల వర్షం... బకెట్లలో కరెన్సీ నింపుకున్న నిర్వాహకులు...
First published: January 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు