హోమ్ /వార్తలు /క్రైమ్ /

హైదరాబాద్ వస్తున్న బస్సు బోల్తా.. 10 మంది పరిస్థితి విషమం

హైదరాబాద్ వస్తున్న బస్సు బోల్తా.. 10 మంది పరిస్థితి విషమం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం ఆదివారం ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందులో మొత్తం 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. ఓ ప్రైవేటు బస్సు చత్తీస్‌ఘడ్ నుంచి కలహండిలోని భవానిపట్న మీదుగా హైదరాబాద్‌కు వస్తోంది. అయితే ఆ బస్సు అంపానీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కెండుగూడ గా్రమానికి సమీపంలో ఉన్న బిజు హైవేపై ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో 30 మందికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోక్సక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పలువురిని వేరే హాస్పిటల్స్‌కు తరలించినట్టుగా సమాచారం. అయితే గాయపడినవారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

ఇక, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను పోలీసులు సేకిస్తున్నారు. రోడ్డుపై ఉన్న భారీ మలుపును బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

First published:

Tags: Odisha

ఉత్తమ కథలు