మూడేళ్ల చిన్నారిపై 10 రోజులు లైంగిక దాడి.. కన్నతల్లి సహకారంతోనే..

పోలీసులు చిన్నారి తల్లిని విచారించగా.. అసలు నిజం బయటపెట్టింది.మార్చి 14న తాను ఆంధ్రప్రదేశ్‌లోని తన ప్రియుడు శివ(32)ను కలిసేందుకు వెళ్లినట్టు తెలిపింది.

news18-telugu
Updated: March 31, 2019, 5:06 PM IST
మూడేళ్ల చిన్నారిపై 10 రోజులు లైంగిక దాడి.. కన్నతల్లి సహకారంతోనే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 31, 2019, 5:06 PM IST
మూడేళ్ల ఓ చిన్నారిపై కన్నతల్లి సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా పది రోజులు ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. ఆ చిన్నారి తల్లితో వివాహేతర సంబంధం ఉన్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన తమిళనాడు పోలీసుల విచారణతో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరులో నివసించే ఓ వివాహిత (30) మార్చి 14న ఇంటి నుంచి అదృశ్యమైంది. తనతో పాటు మూడేళ్ల చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లింది. భార్య కనిపించకపోవడంతో పుట్టింటికి వెళ్లిందేమోనని భర్త ఆరా తీశాడు. అయితే అక్కడికి కూడా రాలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో తిరువళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇదే క్రమంలో మార్చి 26న అతని భార్య ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఇంటికి వచ్చిన రెండు రోజులకే చిన్నారి తీవ్ర అనారోగ్యం పాలైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి లైంగిక దాడికి గురైందని వైద్యులు నిర్దారించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారి తల్లిని విచారించగా.. అసలు నిజం బయటపెట్టింది.మార్చి 14న తాను ఆంధ్రప్రదేశ్‌లోని తన ప్రియుడు శివ(32)ను కలిసేందుకు వెళ్లినట్టు తెలిపింది. అక్కడ శివ, అతని బంధువుతో కలిసి చిన్నారిపై 10 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...