3 year old girl gang raped : కఠిన చట్టాలు అమలులో ఉన్నా కొన్ని మానవ మృగాలు వాటిని ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఏ భయమూ లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధ మహిళల వరకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా దేశరాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల బాలికపై ఇద్దరు వ్యకులు అత్యాచారం చేసిన షాకింగ్ ఘటన దక్షిణ ఢిల్లీ(South delhi)లోని అడవిలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెతో కలిసి శుక్రవారం ఫతేపూర్ బెరీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఈ విషయమై ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్‌లోని సిద్ధి ప్రాంతానికి చెందిన రాంనివాస్ పనికా (27), శక్తిమాన్ సింగ్ (22)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ చెత్త రీసైక్లింగ్‌ను డీల్ చేసే భూమి గ్రీన్ కంపెనీలో సహాయకులుగా పని చేసేవారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ వివాహితులైనట్లు కూడా తెలిసింది.
బాధిత చిన్నారి తల్లి తన ఫిర్యాదులో... "తన కుమార్తె ఉదయం కనిపించకుండా పోయిందని, తన కుమార్తె కోసం వెతుకుతున్న సమయంలో పొరుగింటి మహిళ తన కుమార్తె అడవి ప్రాంతం సమీపంలో నడుచుకుంటూ వెళుతున్నట్లు చూశానని, ఇద్దరు వ్యక్తులు కూడా అదే దిశలో వెళ్లారని చెప్పిందని" తెలిపిందని అధికారి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత పాప ఏడుస్తూ కనిపించిందని,దగ్గరికి వెళ్లి చూడగా తమ కుమార్తె ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించామని బాధిత చిన్నారి తల్లి తెలిపింది. మొదట మహిళ తన భర్తకు జరిగిన సంఘటనను వివరించింది, ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత చిన్నారిని వైద్య పరీక్ష మరియు చికిత్స కోసం ఎయిమ్స్‌కు పంపారు అని అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, బాలికను అడవిలోకి తీసుకెళ్లిన నిందితులను అరెస్టు చేశారు.
Horror Viral: మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..! వీడియో వైరల్
మరోవైపు,తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోన్ బీరమ్మ అనే మహిళను కన్నకొడుకు డబ్బుల కోసం హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన తల్లిని ఎవరో చంపారని అమాయకుడిగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి అసలు నిజాన్ని బయటపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మొలగర గ్రామానికి చెందిన బాల మసయ్యతో 25 ఏళ్ల క్రితం బీరమ్మ (48) వివాహమైంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 20 ఏళ్ల కిందట బాల మసయ్య కొత్తమూల్గరలో హత్యకు గురయ్యాడు. దీంతో బీరమ్మ తన ఇద్దరు పిల్లలతో తల్లిగారి గ్రామమైన మద్దిగుండ్లకు చేరుకుంది. కూలి పనులు చేసుకుని జీవిస్తూ కుమార్తె పెళ్లి చేసింది. ఆ తర్వాత భర్త తరపున వచ్చిన కొంత భూమిని ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన మూడు లక్షల 75 వేల రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చుకుంటూ వచ్చిన వడ్డీతో జీవనం కొనసాగిస్తుంది. కుమారుడైన బీరయ్యకు ఏడాది క్రితం నవాబ్పేట మండలంలోని కూచూరు గ్రామానికి చెందిన చిట్రోల బీరయ్య కుమార్తె మౌనికతో పెళ్లి చేసింది. అనంతరం బీరయ్య ఇల్లరికం వెళ్లి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. ఈ క్రమంలో బీరయ్య మామ అయిన చిటోల్ల బీరమ్మకు రూ.50,000 అప్పు ఇచ్చింది. ఆ డబ్బును ఇటీవల వసూలు చేసుకుంది. ఈ నెల 1న మద్దికుంట నుంచి వచ్చిన కొడుకు బీరయ్య ఇచ్చిన డబ్బులలో తనకు రూ.30,000కావాలని తల్లిని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశానికి గురైన అతడు రోకలిబండతో ఆమె తలపై మోదాడు. దీంతో అక్కడికక్కడే తల్లి మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమె దగ్గరున్న సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని తన అత్తగారి ఊరైన కుచ్చునూరుకు వెళ్లిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Gang rape