స్కూళ్లో చెలరేగిన మంటలు...టీచర్, ఇద్దరు పిల్లలు మృతి

స్థానికులే ధైర్యంచేసి స్కూల్ భవనం పైకప్పు గుండా వారిని బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ కన్నుమూశారు.

news18-telugu
Updated: June 8, 2019, 3:47 PM IST
స్కూళ్లో చెలరేగిన మంటలు...టీచర్, ఇద్దరు  పిల్లలు మృతి
స్కూళ్లో అగ్నిప్రమాదం
news18-telugu
Updated: June 8, 2019, 3:47 PM IST
హర్యానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్కూల్‌లో మంటలు చెలరేగి టీచర్, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఫరీదాబాద్‌ దుబువా కాలనీలోని AND కాన్వెంట్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం స్కూల్‌లో క్లాసులు జరగడం లేదు. ఐతే ఓ టీచర్ మాత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూల్ కింది అంతస్తులో ఉన్న బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా స్కూల్ భవానానికి వ్యాపించడంతో టీచర్, ఆమె ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు.

స్కూల్ నుంచి మంటలు, దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. ఐతే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకోనట్లు తెలుస్తోంది. స్థానికులే ధైర్యంచేసి స్కూల్ భవనం పైకప్పు గుండా వారిని బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ కన్నుమూశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. కాగా, ఇటీవల సూరత్ (గుజరాత్)లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్రిప్రమాదం జరిగి 22 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...