3 PAKISTANIS AMONG 4 TERRORISTS KILLED IN LAST 24 HRS IN JAMMU KASHMIR AS CENTRE PUSHES ZERO TOLERANCE AGAINST MILITANCY PVN
J&K : ఉగ్రవాదులపై ఉక్కుపాదం..24గంటల్లో నలుగురు టెర్రరిస్టులు హతం!
ప్రతీకాత్మక చిత్రం
4 Terrorists Killed in Last 24 Hrs : జమ్మూకశ్మీర్(Jammu Kashmir) లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత 24 గంటల్లో జమ్మూ కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు(Terrorists)హతమయ్యారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు పాకిస్థానీలు కాగా, నాల్గవ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
4 Terrorists Killed in Last 24 Hrs : జమ్మూకశ్మీర్(Jammu Kashmir) లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత 24 గంటల్లో జమ్మూ కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు(Terrorists)హతమయ్యారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు పాకిస్థానీలు కాగా, నాల్గవ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మరియు జమ్మూ కశ్మీర్ పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహించి నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. AK-56, గ్రెనేడ్లు మరియు మందుగుండు సామాగ్రితో సహా భారీ ఆయుధాలు కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా,సరిహద్దు చొరబాట్లకు వ్యతిరేకంగా కేంద్రం "జీరో టాలరెన్స్(Zero Tolerance Against Militancy)" విధానాన్ని తీసుకొచ్చింది. "సంపన్నమైన మరియు శాంతియుత జమ్మూకశ్మీర్" అనే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను నెరవేర్చడానికి ఇది అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah)తెలిపారు. జమ్మూకశ్మీర్ లో పౌరుల హత్యలు, సరిహద్దులో డ్రోన్ కార్యకలాపాలు పెరగడం,స్టిక్కీ బాంబుల బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఈ వారం ప్రారంభంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో రెండు రోజుల క్రితం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు చర్చించారు.
కశ్మీర్ లోయలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)కు భద్రతా సన్నాహాల మధ్య ..అమిత్ షా 15 రోజుల్లో కనీసం రెండు అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి, భద్రతా పరిస్థితిని చర్చించడానికి జూన్ 3 న షా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లు మరియు స్టిక్కీ బాంబులు వంటి కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సాయుధ బలగాలు సాంకేతికతను మెరుగ్గా ఉపయోగించుకోవడమే సమావేశం యొక్క ఎజెండా అని తెలుస్తోంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధిపతులతో హోం సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం కూడా జరిగింది. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పుని ఎదుర్కోవడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడంపై కూడా వారు చర్చించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.