Shocking : ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని మూఢ నమ్మకాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల 3 నెలల వయసున్న చిన్నారి మృతి చెందిన షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్(Madhyapradesh)లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇటీవల న్యుమోనియాతో బాధపడుతున్న 3 నెలల బాలికకు ఆ చిన్నారి తల్లిదండ్రులు గిరిజన సంప్రదాయంగా చికిత్స అందించారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న చిన్నారికి గిరిజన సంప్రదాయంగా నొప్పిని తగ్గించడానికి రాడ్‌తో కాల్చడం వల్ల గాయాలయ్యాయి, అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన 15 రోజుల తర్వాత చిన్నారి మరణించింది. చికిత్స కోసం అడ్మిట్ కాకముందే వారి సంప్రదాయం నేపథ్యంతో ఇలా చేయడంతో కొద్దిరోజులకే చిన్నారి మృతి చెందింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి, పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకోగా.. 15 రోజుల క్రితం మూఢనమ్మకాలతో కూడిన ఈ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యుమోనియాకు సకాలంలో వైద్యం అందకపోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని షాదోల్ జిల్లా కలెక్టర్ వందనా వైద్య తెలిపారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో స్థానికంగా ఉన్న ఓ అంగన్‌వాడీ కార్యకర్త చిన్నారిని రాడ్‌తో కాల్చవద్దని తల్లిని అభ్యర్థించింది. అయితే ఆమె మాట వినకుండా చిన్నారి తల్లిదండ్రులు అలాంటి పనే చేశారు. అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్చామని వందన తెలిపారు. వెంటనే చికిత్స అందించినా చిన్నారిని రక్షించలేకపోయారు.
ఫేస్ బుక్ లో అమ్మాయితో పరిచయం.. బలవంతంగా పెళ్లి.. యువకుడిచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా..
ముందుగా ఆసుపత్రికి తీసుకువస్తే చిన్నారిని రక్షించేవారని ఆసుపత్రి వైద్యుడు తెలిపినట్లు సమాచారం. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ వాజ్‌పేయి మాట్లాడుతూ...ఇలాంటి షాకింగ్ పద్ధతులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని, ఈ ప్రాంత చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను వెంటనే ఫిర్యాదు చేసి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను అని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Madhya pradesh