గన్స్‌తో దొంగల బీభత్సం.. ముగ్గురు దుండగులు పట్టపగలే షాప్‌లోకి దూరి.. CCTVలో దృశ్యాలు..

గన్స్‌తో దొంగల బీభత్సం

దోపిడీ దొంగ‌లు రోజురోజుకు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా ఓ షాప్‌లోకి చొరబడిన దోపిడీ దొంగలు.. తుపాకీలతో చెలరేగిపోయారు.

 • Share this:
  దోపిడీ దొంగ‌లు రోజురోజుకు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా ఓ షాప్‌లోకి చొరబడిన దోపిడీ దొంగలు.. తుపాకీలతో చెలరేగిపోయారు. ముఖాలు ఏర్పడకుండా హెల్మెట్లు, ముసుగు ధరించిన ముగ్గురు దొంగలు.. దోపిడీకి పాల్పడ్డారు. అలాగే షాప్‌లోని కస్టమర్లు భయాందోళనకు గురయ్యేలా చేశారు. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) చోటుచేసుకుంది. పట్టపగలే దొంగలు.. ఇంత ధైర్యంగా దోపిడీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రోజున ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ (Khera Khurd) ప్రాంతంలోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలోకి ముగ్గురు దుర్మార్గులు శనివారం అకస్మాత్తుగా ప్రవేశించారు. ఈ సమయంలో దుకాణంలో ఉన్న కస్టమర్లను, దుకాణం యజమానిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ముగ్గురు దొంగలు మొఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు దొంగలు హెల్మెట్స్ ధరించగా, మరో దొంగ మొఖం చుట్టు ముసుగు ధరించాడు. తుపాకీలు చూపిస్తూ చెలరేగిపోయారు. దీంతో అక్కడున్న కొందరు వారితో వాగ్వాదానికి దిగారు. అయితే వారు మాత్రం తుపాకీలు(Guns) గురిపెట్టి వారిని బెదిరించారు.

  దీంతో షాప్ యజమాని వెంటనే.. తన సీటును వదిలిన పక్కకు వెళ్లిపోయాడు. న‌గ‌దు కోసం వెతుక‌గా క‌నిపించ‌లేదు. దాంతో క్యాష్ కౌంట‌ర్‌లో(Cash Counter) ఉన్న వ్య‌క్తిని పిలిచి న‌గ‌దు తీసి ఇవ్వాల‌ని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అత‌డు చేసేదేమీ లేక క్యాష్ కౌంటర్‌లో ఉన్న‌ న‌గ‌దు చూపించారు. దీంతో ఆ డ‌బ్బులు తీసుకుని.. షాప్‌లో ఉన్న వ్యక్తులందరినీ బెదిరించి మరికొన్ని వస్తువులతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఇక, షాప్‌లోకి చొరబడిన దొంగల్లో ఇద్దరు అక్కడున్న జనాలను బెదిరిస్తుండగానే.. మరో వ్యక్తి కాల్పులు జరిపి జనాలను భయ కంపితులను చేశాడు.

  Shocking: తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కూతురు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. షాప్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను(CCTV Footage) పరిశీలించారు. అందులో దొంగలు చేసిన బీభత్సం సృష్టించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వారు మొఖాలు కనిపించకుండా పక్కా ప్లాన్‌‌గా వ్యవహరించారు.

  Liquor in tap water: ట్యాప్ ఆన్‌ చేస్తే మద్యం కలిసిన నీళ్లు.. నెల రోజులుగా ఇదే తీరు.. అసలేం జరిగిందంటే..

  ఈ నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. దోపిడి జరిగిన సమయంలో నిందితులు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో పాత నేరస్తులు ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. ఇక, ఈ ఘటన షాప్ యజమానులను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
  Published by:Sumanth Kanukula
  First published: