Home /News /crime /

3 MINOR GIRLS DROWN IN A WELL IN MADHYA PRADESHS DEWAS PAH

Shocking: పెను విషాదం.. బావిలో పడిపోయిన ముగ్గురు బాలికలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhya pradesh: దేవాస్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మేకలను మేపడానికి వెళ్లిన బాలికలు అక్కడే ఉన్న పెద్ద బావిలో పడి విగత జీవులుగా మారారు.

3 Minor Girls Drown In A Well In Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లోని దేవాస్ లో దారుణఘటన జరిగింది. మేకలను మేపడానికి వెళ్లిన ముగ్గురు బాలికలు బావిలో పడి చనిపోయారు. ఈ ఘటన జిల్లా కేంద్రానికి 90 కిలో మీటర్ల పరిధిలో జరిగింది. కాంటాఫోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భేసున్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. మేకలను మేపే ప్రదేశానికి దగ్గరలో ఒక బావి ఉంది. అది చాలా లోతుగా ఉంది. అయితే, సాయంత్రం అయిన బాలికలు ఇంటికి రావపోవడంతో వారి తల్లిదండ్రులు ఆయా ప్రాంతాలలో తమ బిడ్డల కోసం వెతికారు.

ఈ క్రమంలో బావిలో చూడగా.. అక్కడ నీళ్లలో తేలుతూ వీరు విగత జీవులుగా కన్పించారు. వెంటనే వారు తమ బిడ్డలను నీళ్లనుంచి బైటకు తీశారు. అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికలు ప్రమాద వశాత్తు నీళ్లలో పడ్డారా.. ఎవరైన ఏదన్నా చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Rajasthan man gets wife molested by relatives

ప్రస్తుత సమాజంలో కొంత మంది పెళ్లి కున్న పవిత్ర బంధాన్ని దిగజారుస్తున్నారు. కొన్ని చోట్ల పెళ్లి తర్వాత... పలు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల కోరిన కట్నం ఇవ్వలేదని, మరింత కట్నం తెవాలని తమ భార్యలను హింసిస్తున్నారు. మరికొన్ని చోట్ల పెళ్లైన తర్వాత కూడా వివాహేతర సంబంధాలతో తమ పరువును బజారుకు ఈడ్చుకుంటున్నారు. ప్రధానంగా వరకట్న వేధింపులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan)భరత్ పుర్ లో దారుణ మైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పున్హానా ప్రాంతంలో 2019 మే 25వ తేదీన రాజ‌స్థాన్ కు చెందిన ఓ వ్య‌క్తితో బాధిత మ‌హిళ‌కు వివాహం జ‌రిగింది. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో, అత్తమామలు కట్నం కోసం (Dowry harassment) వేధించడం మొదలుపెట్టారు. ప్రతి రోజు కట్నం తేవాలని ఆమెను మానసికంగా హింసించే వారు. కాగా, ఆమెకు... 1.5 లక్షల నగదు, బుల్లెట్ బైక్ ఇవ్వాలని అత్త మామ, భ‌ర్త‌ డిమాండ్ చేశారు.

వీరి హింసలను తాళలేక ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. కొన్ని నెలలపాటు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత.. పెద్దల ఎదుట బాగా చూసుకుంటానని చెప్పించి తిరిగి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కొన్ని రోజులకే మరలా అత్తింటి వారు (Harassed woman) వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఒక రోజు భర్త.. తనకు తెలిసిన వారితో ఆమెను పనికి పంపాడు. అతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Dead bodies, Madhya pradesh, Minor girl, Water

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు