కారును ఢీకొట్టి పరారీ.. కడప యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతి

కారును ఢీకొట్టి పరారీ.. కడప యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతి

కారు యాక్సిడెంట్ (Fil/Photo)

కారును ఢీకొట్టి పారిపోయిన వావాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • Share this:
    కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం సమీపంలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయాగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులు రంగారెడ్డి జిల్లా కంకల్ వాసులని పోలీసులు తెలిపారు. కంకల్ నుంచి తిరుపతికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టి పారిపోయిన వావాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: