Bomb Blast At Trinamool Leader House : వెస్ట్ బెంగాల్(West bengal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని నార్యబిలా గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్న అధ్యక్షుడి ఇంట్లో శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో బాంబు పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. టీఎంసీ నేతలు రాజ్‌కుమార్ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బాంబు పేలుడులో ఘటనలో రాజ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
కాగా,పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. "పేలుడుకు గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది, అయితే దాని ప్రభావం చాలా శక్తివంతమైనది, ఈ సంఘటనలో గడ్డితో కప్పబడిన మట్టి ఇల్లు పేలిపోయింది"అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పెళ్లికి మందు శృంగారం నేరం..వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, West Bengal