కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు...విజయనగరంలో ముగ్గురు సజీవదహనం

మృతులను బొబ్బిలి మండలం అలజంగికి చెందిన జగదీశ్‌, బాడంగి మండలం గొల్లాదికి చెందిన సురేష్, భీమవరం గ్రామానికి చెందిన చింతల గోపాలనాయుడుగా గుర్తించారు.

news18-telugu
Updated: June 14, 2019, 3:45 PM IST
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు...విజయనగరంలో ముగ్గురు సజీవదహనం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 3:45 PM IST
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొబ్బిలిలోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలడంతో దట్టమైన పొగలతో పాటు భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు. మృతులను బొబ్బిలి మండలం అలజంగికి చెందిన జగదీశ్‌, బాడంగి మండలం గొల్లాదికి చెందిన సురేష్, భీమవరం గ్రామానికి చెందిన చింతల గోపాలనాయుడుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...