హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road Terror: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రాక్టర్ ఢీ.. ముగ్గురు మృతి.. మరో 20 మందికి తీవ్ర గాయాలు..

Road Terror: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రాక్టర్ ఢీ.. ముగ్గురు మృతి.. మరో 20 మందికి తీవ్ర గాయాలు..

బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రదేశం

బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రదేశం

Rajasthan: అల్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన బస్సు ట్రాక్టర్ వాహానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు.

Road accident at Alwar: రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన బస్సు, ట్రాక్టర్ వాహానాలు ఢీకొన్నాయి.ఈ ఘటన వలన ఒక్కసారిగా రోడ్డంతా భీతావహాకంగా మారిపోయింది. దీనిలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుషల్ గఢ్ సమీపంలో... రాజస్థాన్ రోడ్ వేస్ బస్సు, ఇటుకలతో నిండిన ట్రాక్టర్ మధ్య ప్రమాదం జరిగింది. వీరిలో ముగ్గురు ఘటన స్థలంలోనే వాహానాల కింద విగత జీవిగా మారిపోయాడు.

మృతుల్లో బస్సు డ్రైవర్ ఉన్నారు. మిగతా వారిని సమీపలోని ఆస్పత్రికి తరలించారు. వారందరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వలన ప్రమాదం జరిగిందా లేదా అదుపు తప్పి ఢీకొన్నాయా, నిద్రమత్తులో ఏదైన ప్రమాదం జరిగిందా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది.

బెంగుళూరులో విషాదకర ఘటన. బెంగుళూరు-కడపరహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పదిహేను రోజుల క్రితం కూండా బెంగళూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. హైవేపై ప్రయాణిస్తున్న కాస్లీరు ఓ కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లో చనిపోయారు. ఈ సంఘటన అర్థరాత్రి రెండు గంటల తర్వాత జరిగినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళ లోని ఓ కన్వేషన్ సెంటర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రహదారిలోని ఓ కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చేలరేగాయి.


దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు

First published:

Tags: Crime news, Rajasthan, Road accident

ఉత్తమ కథలు