‘నో హెల్మెట్‌, నో పెట్రోల్’ నిబంధన ఉల్లంఘన...ముగ్గురు వాహనదారుల అరెస్ట్

No Helmet - No Petrol Rule | నోయిడా, గ్రేటర్ నోయిడాలో జూన్ 1నాటి నుంచి నో హెల్మెట్, నో పెట్రోల్ నిబంధనల అమలులోకి వచ్చింది. ఈ ట్రాఫిక్ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత తొలి అరెస్టులు ఇవే కావడం విశేషం.

news18-telugu
Updated: June 12, 2019, 7:03 PM IST
‘నో హెల్మెట్‌, నో పెట్రోల్’ నిబంధన ఉల్లంఘన...ముగ్గురు వాహనదారుల అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 12, 2019, 7:03 PM IST
నెలక్రితం అమలులోకి తీసుకొచ్చిన ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ నిబంధనను ఉల్లంఘించినందుకు ముగ్గురు వాహనదారులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. సెక్టార్ 71లో హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు తమ వాహనాల్లో పెట్రోల్ నింపాలని కోరారు. వారికి హెల్మెట్ లేకపోవడంతో పెట్రోల్ నింపేందుకు బంక్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన ముగ్గురు వాహనదారులు పెట్రోల్ బంక్  సిబ్బందితో గొడవకు దిగారు. తమ వాహనాల్లో బలవంతంగా పెట్రోల్ నింపించేందుకు ప్రయత్నించారు.

పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు వాహనదారులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో జూన్ 1నాటి నుంచి నో హెల్మెట్, నో పెట్రోల్ నిబంధనల అమలులోకి వచ్చింది. ఈ ట్రాఫిక్ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత తొలి అరెస్టులు ఇవే కావడం విశేషం. వీరు ముగ్గురిని సిటీ మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరిచిన పోలీసులు..మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.

helmet rule, helmet rule in tamilnadu, helmet rules india, helmet rules in telangana, helmet rules in hyderabad, Madras High Court, హెల్మెట్ రూల్, హెల్మెట్ నిబంధన, తమిళనాడులో హెల్మెట్ నిబంధన, మద్రాస్ హైకోర్టు, హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన, హెల్మెట్ రూల్స్
ప్రతీకాత్మక చిత్రం


హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వచ్చి అక్కడి సిబ్బందిపై దాడికి ప్రయత్నిస్తే ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోయిడా పోలీసులు హెచ్చరించారు. ఈ నిబంధనను ఇక కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...