విశాఖలో మిస్సింగ్ కలకలం.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం

విశాఖపట్టణంలో అమ్మాయిల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెలెళ్లు అదృశ్యమయ్యారు. మేం చనిపోతున్నా.. మా కోసం వెతకొద్దంటూ పేరెంట్స్‌కు మెసేజ్ పెట్టారు.

news18-telugu
Updated: February 18, 2020, 3:35 PM IST
విశాఖలో మిస్సింగ్ కలకలం.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్టణంలో అమ్మాయిల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెలెళ్లు అదృశ్యమయ్యారు. మేం చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దంటూ పేరెంట్స్‌కు మెసేజ్ పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ద్వారకానగర్‌కు చెందిన ఎర్రన్నాయుడు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు‌కు ఉన్నారు. వారిలో వయసు 22, 20, 17 సంవత్సరాలు. సోమవారం సాయంత్రం ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

ఐతే మంగళవారం అమ్మాయిల తల్లికి మెసేజ్ వచ్చింది. మేం చనిపోతున్నామని.. మా కోసం వెతకొద్దని సందేశం పంపడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఆ ముగ్గురి అమ్మాయిల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. మెసేజ్ వచ్చిన సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఇంటి చుట్టు పరిసరాలతో పాటు దాంతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అంతేకాదు విశాఖపట్టణం చుట్టపక్కల ఉన్న సూసైడ్ స్పాట్స్ వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. ఐతే ముగ్గురు అక్కాచెల్లెళ్లు వాళ్లంతట వారే వెళ్లిపోయారా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు