రోజుల పసికందు నుంచి పండు ముసలి దాకా ఆడవాళ్లను వదలని కామాంధులు.. చాలా సార్లు మగ పిల్లలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. కొంతకాలంగా జంతువులపైనా కీచకుల అకృత్యాలు పెరుగుతున్నాయి. ఆవులు, గేదెలు, కుక్కల వంటి జీవులపై లైంగికదాడులకు పాల్పడుతోన్నవారి సంఖ్య, సంబంధిత కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వీటిలో చాలా కేసుల్లో వీడియో ఆధారాలు ఉండటం గమనార్హం. తాజా ఘటనలో మరీ దారుణంగా ఉడుముపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలివే..
మహారాష్ట్రలో విస్తరించిన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పులల సంరక్షణ కోసం సహ్యాద్రి టైజర్ రిజర్వ్ ప్రాజెక్టు కొనసాగుతోంది. కొల్హాపూర్, సతారా జిల్లాల పరిధిలోని ఈ రిజర్వ్ ఫారెస్టులో వేటగాళ్లు ఓ ఉడుమును బంధించి, అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఈ దారుణంగానికి సంబంధించిన దృశ్యాలు మొబైల్ ఫోన్లో రికార్డయినట్లు గుర్తించిన అధికారులు షాకయ్యారు. నాటకీయరీతిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..
సహ్యాద్రి టైగర్ ప్రాజెక్టు పరిధిలో పులల సంరక్షణలో భాగంగా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఫారెస్ట్ అధికారులు పలు చోట్ల కెమెరాలు అమర్చారు. ఇటీవల కొందరు వేటగాళ్లు తుపాకీలతో తిరుగుతున్నారనే సమాచారంతో అధికారులు కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు తుపాకులతో సంచరిస్తుండటం కనిపించింది. అధికారులు పక్కాగా వలపన్ని, నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుదాలు, ద్విచక్రవాహనాలు, మొబైల్ ఫోన్లను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో..
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను పరిశీలించగా, వాటిలో షాకింగ్ దృశ్యాలు రికార్డయి ఉన్నాయి. అరెస్టయిన ముగ్గురు నిందితుల్లో ఒకడు ఉడుముపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలవి. ముగ్గురిపైనా కేసులు నమోదు చేశామని, ఉడుముపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని మానసిక వైద్యుల వద్దకు పంపిస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.