హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana : అక్కడ కాపురాలు కూల్చుకునే దంపతుల సంఖ్యే ఎక్కువ .. ఎందుకో ..? ఎక్కడో తెలుసా..?

Telangana : అక్కడ కాపురాలు కూల్చుకునే దంపతుల సంఖ్యే ఎక్కువ .. ఎందుకో ..? ఎక్కడో తెలుసా..?

Divorce Cases(FILE)

Divorce Cases(FILE)

Telangana: మహబూబ్‌నగర్ జిల్లాలో కుప్పు కూలుతున్న కాపురాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో విడాకుల కోసం వస్తున్న ఫిర్యాదుల సంఖ్య..పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కుతున్న జంటల లిస్ట్ చెబితే షాక్ అవుతారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  చిన్న చిన్న విషయాలకు కాపురాల్లో కలతలు వస్తున్నాయి. సర్దుకు పోయే సహనం లేకపోవడంతో చివరకు విడాకుల (Divorce)వరకు వస్తున్నారు. కలహాలు, కలతలు వచ్చిన కాపురాలను పెద్దలు ఒప్పించి సర్ది చెప్పి భార్యభర్తల మధ్య రాజీ కుదిర్చినప్పటికి ఆ కాపురాలు కొద్ది కాలమే నిలబడుతున్నాయి. మళ్లీ ఏదో సమస్యలను సృష్టించుకొని భార్యభర్తలు తమ బంధాన్ని తెగ తెంపులు చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో ఈతరహా కేసులకు ప్రధాన కారణం పెళ్లిళ్లు చేసుకున్న మగవాళ్లో దురలవాట్లు, కొందరిలో అదనపు కట్నం కోరికలు, మరికొందరిలో వివాహేతర సంబంధాలే పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి.

  Screaming Teacher: కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా .. టెన్త్ విద్యార్ధినిని లెక్కల టీచర్ ఏం చేశాడో తెలుసా..?

  పెటాకులవుతున్న పెళ్లిళ్లు..

  మహబూబ్‌నగర్ జిల్లాలో కుప్పు కూలుతున్న కాపురాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు చెబుతున్న వివరాలు చూస్తుంమటే ఆశ్చర్యం కలుగుతోంది. పోలీస్ స్టేషన్‌లకు ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్లే వస్తున్నారని చెబుతున్నారు. యుక్త వయసులో ఆకర్షణకు లోనై ప్రేమించుకోవడం అటుపై పెళ్లి చేసుకోవడం వరకు సజావుగానే సాగుతున్న సంసారాలు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే ఆర్థిక సమస్యలతోనే కలహాలు మొదలవుతున్నాయని తేల్చారు. ఓవైపు ఆర్దిక ఇబ్బందులు మరోవైపు సంసారంలో ఆధిపత్య స్వభావం కారణంగా భార్యాభర్తలు పంతలకు పోతూ పెళ్లిళ్లను పెటాకులు చేసుకొని ఇబ్బందులు పడుతున్న వారిలో ఎక్కువగా యువతులే ఉన్నారు.

  సర్దుకుపోయే సహనం లేక..

  ఇదిలా ఉంటే వైవాహిక జీవితంలో 10నుంచి 20ఏళ్ల పాటు కాపురం చేసిన చాలా తక్కువ మంది పోలీస్ స్టేషన్‌కి వచ్చి విడాకులు కోరుతున్న వాళ్లు ఉన్నారు. వాళ్లు చూపించే కారణాలు చాలా చిన్నవిగా ఉంటాయని వారికి నిపుణుల ద్వారా మానసిక వైద్యుల ద్వారా కౌన్సిలింగ్‌ ఇస్తున్నాట్లు తెలిపారు సీఐ హనుమప్ప. గొడవలు పడి విడిపోవాలనుకునే దంపతులను కలిపేందుకు సాధ్యమైనంత వరకు తాము ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. ఒకవేళ వినని పక్షంలో కేసులు నమోదు చేయాల్సి వస్తోందంటున్నారు.

  ఐదేళ్లలో ఎన్ని ఫిర్యాదులో ..

  ఉమ్మడి మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ , జోగులాంబ గద్వాల , వనపర్తి జిల్లాల్లో ఐదేళ్లలో  గొడవపడి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దంపతుల ద్వారా 2,912 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 2525 జంటలకు అవగాహన కల్పించి పంపారు. కలిసి ఉండటానికి ఇష్టపడిన వారి నుంచి కూడా 387 ఫిర్యాదులు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదుదారుల్లో ఎక్కువ మంది 25 ఏళ్ల లోపు వారే ఉండటం విశేషం.

  Suicide: ఆ టార్చర్ భరించలేక ఎంసెట్ ర్యాంకర్‌ సూసైడ్ .. ప్రాణాలు తీసిన 15వేల అప్పు

  పాతికేళ్లలోపు వారే ఎక్కువ..

  గడిచిన ఐదేళ్లలో ఎక్కువగా ఈ ఏడాదిలోనే విడాకుల కోసం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన జంటలున్నారు. అందులో కూడా పాతికేళ్లోపు వారే ఎక్కువగా ఉండటం విశేషమని పోలీసులు చెబుతున్నారు. క్షణికావేశం, సర్దుకుపోయే స్వభావం లేని వాళ్లు, వివాహేతర సంబంధాలకు ఆకర్షితులైన వాళ్లు, మద్యం తాగి భర్త పెట్టే టార్చర్ భరించలేక విడిపోవాలనుకునే వాళ్లు తమ కాపురాలను చిధ్రం చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Divorce couple, Mahbubnagar, Telangana News

  ఉత్తమ కథలు