Home /News /crime /

29 YEARS OLD YOUNG WOMAN GET PREGNANT WITH YOUNGER BROTHER LEADS TO HER DEATH BY FAMILY IN TAMIL NADU HSN

29 ఏళ్ల యువతి.. తమ్ముడి వల్లే తల్లి అయింది.. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

29 ఏళ్ల వయసున్న ఓ యువతి. వరుసకు తమ్ముడి వల్లే తల్లయింది. విషయం పది మందికి తెలిస్తే పరువు పోతుందని ఆ కుటుంబ సభ్యులు భావించారు. అంతే ఓ దారుణ నిర్ణయానికి వచ్చేశారు. చివరకు..

  ఆ యువతి వయసు 29 ఏళ్లు. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా గతేడాది నుంచి ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నాడు. ఆమెకు వరుసకు తమ్ముడయ్యే కుర్రాడు ఆ ఇంట్లోకి చేరాడు. చాలా నెలలుగా వాళ్లింట్లోనే ఉంటున్నాడు. వారిద్దరి మధ్య బాగానే చనువు ఉంది. ఒక్కోసారి వారిద్దరూ మాటల్లో హద్దులు దాటి సెటైర్లు వేసుకున్నా అక్కాతమ్ముడే కదా అని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కానీ వారి మధ్య అక్కాతమ్ముళ్ల బంధం కాస్తా అక్రమ సంబంధంలా మారిపోయింది. ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది. ఆ విషయం కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. అబార్షన్ కు కూడా వీలు లేని పరిస్థితులు రావడంతో వాళ్లే చివరకు డెలివరీ చేశారు. విషయం బయటకు పొక్కకుండా ఉండాలని ఇంట్లోనే ప్రసవం జరిపారు. చివరకు తల్లీబిడ్డ ప్రాణాలను తీశారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్ అనే వ్యక్తికి మంగయకరసి అనే 29 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఓ ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోంది. గతేడాది నుంచి కొవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులు చెబుతోంది. తన తల్లి తంగం, సోదరి గణేష ప్రియ, సోదరుడు కాళిదాసుతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. అయితే వాళ్లింట్లోకి అదీష్ కుమార్ అనే కుర్రాడు చేరాడు. మంగయకరసికి అతడు వరుసకు తమ్ముడు అవుతాడు. వాళ్లు సన్నిహితంగా కనిపించినా అక్కాతమ్ముడే కదా అని ఇంట్లో వాళ్లు పట్టించుకోలేదు. కానీ వాళ్లిద్దరు మాత్రం వావీవరుసలు మరిచారు. అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. తమ్ముడి వల్లే తల్లి అయిందని నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భావించిన కుటుంబ సభ్యులు అబార్షన్ చేయించాలని చూశారు.
  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  కానీ అబార్షన్ చేయడానికి నెలలు దాటిపోవడంతో ఏం చేయలేకపోయారు. ఇంట్లోనే ఆమెను ఉంచారు. నెల నెలా మందులు వాడారు. నిండు నెలలు వచ్చిన తర్వాత ఆమెకు ఇంట్లోనే ప్రసవం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రసవం ఎలా చేయాలన్నది యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు పురుటినొప్పులు రావడంతో తల్లి, సోదరి, సోదరుడు కలిసి ఇంట్లోనే ప్రసవం చేశారు. బిడ్డను బయట చెత్తకుప్పలో పారేశారు. ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మరణించిందని వైద్యులు చెప్పడంతో హుటాహుటిన ఇంటికి తీసుకొచ్చి వెంటనే అంత్యక్రియలు చేశారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి కుటుంబ సభ్యులను నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతి తల్లి, సోదరి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడు అదీష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా చెత్తకుప్పలో పడేసినప్పుడు బిడ్డ బతికే ఉన్నాడని విచారణలో వాళ్లు వెల్లడించడంతో పోలీసులు బిడ్డ గురించి ఆరా తీస్తున్నారు. ఆ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, CYBER CRIME, Mumbai crime, Tamil nadu, Telangana crime

  తదుపరి వార్తలు