మూడేళ్ల కిందట జరిగిన హత్య... ఇప్పుడెలా ఛేదించారు... చేసిందెవరు... ఎందుకు...

Delhi Crime : పోలీసుల నుంచీ తప్పించుకునేందుకు హంతకుడు రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫొటోగ్రఫీ చేశాడు. ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అమ్మాడు. కూలీగా పనిచేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 9, 2019, 1:01 PM IST
మూడేళ్ల కిందట జరిగిన హత్య... ఇప్పుడెలా ఛేదించారు... చేసిందెవరు... ఎందుకు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలో 29 ఏళ్ల యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల కిందట అతడు రోహిణీలో ఓ గూండాను హత్య చేసినట్లు తేలింది. తన అన్నయ్య దగ్గర దోపిడీకి పాల్పడినందుకు ఆ గూండాపై పగబట్టిన యువకుడు... రోహిణీలోని సర్దార్ కాలనీలో హత్య చేశాడు. హంతకుణ్ని సత్పాల్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు... వాజీర్పూర్‌లోని జేజే కాలనీలో అరెస్టు చేశారు. ఆ సమయంలో అతను తన తల్లిదండ్రుల్ని కలిసేందుకు అక్కడకు వస్తున్నాడని పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారు. 2016లో సత్పాల్ సింగ్, అతని అన్నయ్య జగ్ రాజ్ సింగ్ కలిసి... ఘనా అనే గూండాను కత్తులతో పొడిచి, ఇనుప రాడ్డులు, బాస్కెట్ బాల్ స్టిక్స్‌తో రక్తం చిందేలా కొట్టారు. శవాన్ని 100 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డు పక్కన పడేసిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఘనా చనిపోయాడు.

హంతకుల్లో ఒకడైన జగ్ రాజ్ సింగ్‌ను పంజాబ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. మరో హంతకుడైన సత్పాల్ సింగ్ పోలీసుల నుంచీ మూడేళ్లుగా తప్పించుకు తిరిగాడు. సత్పాల్ సింగ్‌ను ఇంటరాగేట్ చెయ్యగా... తన అన్నయ్య జగ్ రాజ్ సింగ్‌ ... సట్టా వ్యాపారం (ఇదో రకమైన జూదం లాంటిది) చేసేవాడని, సర్దార్ కాలనీలో మత్తు పదార్థాలు అమ్మేవాడనీ తెలిపాడు. ఆ ఏరియాలో గూండాలా వ్యవహరించే ఘనాకు అది నచ్చేది కాదని వివరించాడు.

మార్చి 28, 2016 నాడు... ఘనా తన అనుచరులతో వచ్చి... జగ్ రాజ్ సింగ్ దగ్గరున్న సట్టా డబ్బులను బలవంతంగా లూటీ చేశాడు. జగ్ రాజ్ మనుషులను చితకబాదాడు. జగ్ రాజ్ సింగ్‌ను చంపేస్తానని బెదిరించాడు. అంతే... అన్నయ్యకు జరిగిన అవమానం తెలుసుకున్న ఆ తమ్ముడి రక్తం మరిగిపోయింది. వాడు నా అన్నను చంపేదేంటి... నేనే వాణ్ని చంపుతా అనుకున్నాడు. తర్వాతి రోజే అన్నను వెంటబెట్టుకొని సర్దార్ కాలనీకి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే అన్నదమ్ములిద్దరూ కలిసి... ఒంటరిగా ఉన్న ఘనాపై దాడి చేసి, అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి, ఇనుపరాడ్డులు, బాస్కెట్ బాల్ కర్రలతో కొట్టి పారిపోయారు.


హత్య తర్వాత ఇద్దరూ ఢిల్లీ పారిపోయారు. తర్వాత పంజాబ్ వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. పోలీసులు పంజాబ్ వెళ్లి జగ్ రాజ్‌ను అరెస్టు చేశారు. సత్పాల్ సింగ్ మాత్రం... మూడేళ్లుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరిగాడు. ఇందుకోసం అతడు రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫొటోగ్రఫీ చేశాడు. ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అమ్మాడు. కూలీగా పనిచేశాడు. చివరకు అతను కూడా దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇవి కూడా చదవండి :

ఏపీలో పసుపు కుంకుమ నిధులు విడుదల... బ్యాంకుల దగ్గర బారులు తీరిన మహిళలు

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసినట్లేనా... కారు దూసుకుపోతుందా...

అమిత్ షా కష్టం మామూలుది కాదు.. ఆయనలా మరెవరూ కష్టపడలేరు : మోదీ
First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading