హోమ్ /వార్తలు /క్రైమ్ /

తనతో సంబంధం తెంచుకుందని... ప్రేమికురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన లవర్

తనతో సంబంధం తెంచుకుందని... ప్రేమికురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన లవర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డేటింగ్ అంటూ నాలుగేళ్లు కలిసి తిరిగారు. ప్రేమించుకున్నారు. చెడు లక్షణాలను మానేయాలని ఆమె కోరింది. కానీ అతడు ఒప్పుకోలేదు. ఏకాంత ప్రదేశానికి పిలిచి....

  • News18
  • Last Updated :

డేటింగ్.. స్నేహం పేరిట కలిసి తిరగడం.. కలిసిన్నన్ని రోజులు వారి ఆనందానికి హద్దే లేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రాగానే విడిపోవడం.. మళ్లీ ఆ బంధం కోసం పాకులాడటం.. కుదిరితే మెప్పించడం లేదా చంపేయడం.. ఇవి ఈ కాలపు యువత ప్రేమకు చెబుతున్న భాష్యాలు. ఆకర్షణ ముసుగు తొలగిపోగానే మనుషుల అసలు రూపాలు బయటపడుతున్నాయి. నిన్నటి దాకా.. నూవ్వంటే ప్రాణమని దగ్గరికి తీసుకుని ఓదార్చిన చేతులే నేడు కత్తి పడుతున్నాయి. ఏదైనా బాధొస్తే ఓదార్చిన మనిషే.. నేడు రాక్షస కౌగిలిలో బంధిస్తున్నాడు. ఇటువంటి తరహా ఘటనే ముంబయిలో ఆలస్యంగా వెలుగుచూసింది. నాలుగేళ్లుగా ప్రేమ చూపించి.. తనతో సంబంధం తెంచుకుందని ఒక యువతిని అతి కిరాతకంగా చంపాడో వ్యక్తి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. ముంబయికి చెందిన తేజస్ ఖబ్రేకర్, రుచిత (25)లు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాలేజీ రోజుల నుంచే వారికి పరిచయం. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ నాలుగేళ్లలో ముంబయిలో వాళ్లు తిరగని బీచ్ లేదు. వెళ్లని చోటు లేదు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ తేజస్ పెద్ద తాగుబోతు. రుచిత ఎన్నిసార్లు అతడితో మందు మాన్పించాలని చూసినా.. ఆమెకు సాధ్యం కాలేదు. మధ్యలో చాలా సార్లు వారిద్దరి మధ్య ఇదే విషయమై మనస్పర్థలు వచ్చాయి. మద్యం మానేయకుంటే తాను మాట్లాడనని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా తేజస్ లో మార్పు రాలేదు.

దీంతో విసిగెత్తి పోయిన రుచిత.. కొద్దిరోజల నుంచి అతడితో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నది. తేజస్ కాల్స్ కు కూడా సరిగా సమాధానం ఇవ్వడం లేదు. పలుమార్లు ఫోన్ స్విచ్చాఫ్ కూడా చేసేది. దీంతో తేజస్ కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమె కరాకండీగా ఉన్న విషయం చెప్పింది. మందు మానేయకుంటే బంధం కొనసాగదని తేల్చిచెప్పింది.

ఈ క్రమంలో ఈనెల 13న ఒకసారి మాట్లాడాలని ఆమెను పిలిచాడు. ఆ యువతి దాదర్ అనే ప్రాంతానికి చేరుకుంది. రాత్రి 11 గంటల సమయం. ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు తేజస్. కానీ తేజస్ గురించి తెలిసిన రుచిత.. అవేమీ వినిపించుకోలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన తేజస్.. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయబోయాడు. ఇది చూసిన రుచిత అక్కడ్నుంచి తప్పించుకోబోయింది. కానీ వెనకనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ను కత్తితో పొడిచాడు తేజస్. మెడ భాగంలోనూ కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కింద పడింది. దారంతా రక్తపు మడుగు. ఇది చూసిన తేజస్.. అక్కడ్నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి విఘతజీవిగా పడిఉన్న రుచిత ను చూసి.. పోలీసులకు సమాచారమందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.

కాగా, బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లగా.. జేబులో ఉన్న కత్తితో పొడుచుకుని తనను తాను గాయపరుచుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిపై మర్డర్ కేసు నమోదైందని.. కోలుకోగానే విచారణ ప్రారంభించి.. అతడిని కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Maharashtra, Mumbai, Murder, Murder attempt

ఉత్తమ కథలు