Home /News /crime /

27 YEARS OLD WOMAN CHEATS 16 MEN WITH THE HELP OF DATING APP IN MAHARASHTRA HSN GH

Woman on Dating App: డేటింగ్ యాప్.. నిలువు దోపిడీ.. మాయలేడి ఆట కట్టు.. ఖాకీలా మజాకానా.. షాకింగ్ వివరాలు ఇవిగో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్న వయసులో బాగా డబ్బు సంపాదించాలనే యావతో ఆమె ఏం చేసిందో తెలుసా?

ఓ నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వచ్చి తాము డేటింగ్ యాప్స్ లో పరిచయమైన మహిళ చేతుల్లో మోసపోయినట్టు కంప్లైంట్ నమోదు చేశారు. మొబైల్ ఫోన్లు, బంగారంతో పాటు విలువైన వస్తువులను ఆమె కాజేసేందుకు తమ డ్రింక్స్ లో మత్తు మందు కలిపిందన్న కంప్లైంట్ ను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు మంచి స్కెచ్ వేశారు. ఇంకేముంది ఠక్కుమని ఆ మాయ లేడీని అరెస్ట్ చేసి, అసలు మోడస్ ఆపరండీ ఏంటో వివరించమంటే ఆమె చెప్పిన వివరాలు పోలీసులకే దిమ్మదిరిగేలా చేసాయి. అంతేకాదు ఆమె వద్ద నుంచి విలువైన వస్తువులతో పాటు.. ఏకంగా 15,25,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పింప్రీ-చింద్వాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ 27 ఏళ్ల అమ్మాయిని సాక్షాధారాలతో సహా పట్టుకున్న విధానం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. డేటింగ్ యాప్స్ లో 16 మందిని బోల్తా కొట్టించిన మహిళను ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. పూనేలో నివాసం ఉంటున్న సయాలి అలియాస్ షిఖా దేవేంద్ర కలే అనే మహిళ చేతిలో ఇలా మోసపోయిన వారిలో కొందరు ఇంకా బయటికి చెప్పుకోలేకపోతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫేక్ ప్రొఫైల్ తో..
సయాలీ అనే ఈ మాయలేడిని పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ స్కెచ్ వేసి డేటింగ్ యాప్ లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఆమెను ట్రాక్ చేసి ఎట్టకేలకు నిలువుదోపిడీకి పాల్పడుతున్న సయాలిని అరెస్ట్ చేయగలిగారు. ఇక విచారణలో ఆమె విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఈజీగా డబ్బు సంపాదిస్తూ.. త్వరగా ధనవంతురాలు కావాలనే ఆలోచనతోనే ఈ మార్గాన్ని అనుసరించినట్టు తెలిపింది. నిందితురాలి ఇంటి నుంచి కొంత డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చెబుతున్న వివరాలు మాత్రం చాలా షాకింగ్ గా ఉన్నాయి.

బాగా చదువుకున్న మహిళ..
నిజానికి ఈమె ఉన్నత చదువులు చదువుకొన్న మహిళ అని, 10 ఏళ్ల క్రితం ఆమె తండ్రిని పోగొట్టుకున్న ఈమె టెలికం కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగం పోవటంతో ఇలాంటి మోసాలకు దిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక తన తల్లి బీపీ పేషెంట్ కావటంతో తల్లి కోసం ఉపయోగిస్తున్న నిద్ర మాత్రలను ఈమె తన బ్యాగులో వేసుకుని డేటింగ్ యాప్ లో పరిచయమైన వారిని కలిసేందుకు వెళ్లి.. వారిపై వీటినిప్రయోగించి దోపిడీకి పాల్పడటాన్ని రొటీన్ గా పెట్టుకుంది.

స్మార్ట్ చోర్..
అంతే కాదు చాలా స్మార్ట్ గా వ్యవహరించిన ఈమె.. డేటింగ్ చాట్ లో చాట్ హిస్టరీని కూడా డిలీట్ చేసి అక్కడి నుంచి పరారీ అయ్యేదని పోలీసులు తెలిపారు. ఇలా తెచ్చిన బంగారాన్ని నగరంలోని బంగారు వ్యాపారి వద్ద ఒకసారి కుదువ పెట్టి, తన తండ్రికి క్యాన్సర్ కావటంతో ఇలా బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తోందని తన తండ్రి ఆర్మీలో పనిచేసిన రిటైర్ ఉద్యోగి అని నమ్మబలికినట్టు విచారణలో ఆమె తెలిపింది.
Published by:Hasaan Kandula
First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Viral Videos, Wife kill husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు