26 YEARS OLD YOUNG MAN COMMIT SUICIDE AFTER INFECTED WITH CORONA IN WEST GODAVARI DISTRICT FULL DETAILS HERE HSN
Andhra Pradesh: 26 ఏళ్ల కుర్రాడి ఫోన్ కు ఓ మెసేజ్.. టెన్షన్ తో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందంటే..
ప్రతీకాత్మక చిత్రం
గురువారం రాత్రి ఆ కుర్రాడు తన సొంతూరికి వచ్చాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ కుర్రాడికి ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఆ కుర్రాడు ఆందోళన చెందాడు. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందనే కదా మీ డౌటు.
26 ఏళ్ల ఆ యువకుడి ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ను చూసిన అతడికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. ఆందోళన చెందాడు. ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లాడు. ఎక్కడకు వెళ్లాడో తెలియక కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అతడికి ఫోన్ చేశారు. పలుమార్లు లిఫ్ట్ చేయని అతడు ఎట్టకేలకు కొద్ది సేపటి తర్వాత ఫోన్ ఎత్తాడు. తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడాడు. ఆ మెసేజ్ సారాంశం ఏంటో తల్లిదండ్రులతో చెప్పేశాడు. అమ్మా..నాన్నా.. సారీ.. బై అన్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని తేల్చి చెప్పాడు. అతడిని వెతుక్కుంటూ వెళ్లిన వారికి అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే మరణించాడని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లికి చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు గుంటూరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఇంటికి దూరంగా అక్కడే ఉండేవాడు. గురువారం రాత్రి ఆ కుర్రాడు తన సొంతూరికి వచ్చాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ కుర్రాడికి ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఆ కుర్రాడు ఆందోళన చెందాడు. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందనే కదా మీ డౌటు. ‘మీకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరండి. జాగ్రత్తగా ఉండండి‘ అంటూ అతడికి మెసేజ్ వచ్చింది. రెండ్రోజుల క్రితమే పని చేస్తున్న చోటే అతడికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ఆ టెస్టుల రిజల్ట్ రాకముందే అతడు సొంతూరికి వెళ్లాడు. తీరా ఇంటికి వెళ్లిన మరుసటి రోజే అతడికి కరోనా అని తేలింది. దీంతో తనకు ఏమైనా అవుతుందేమో, తన వల్ల తన తల్లిదండ్రులకు కరోనా సోకుతుందేమోనన్న భయం అతడిలో కలిగింది. అంతే, శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. కొడుకు ఎక్కడకు వెళ్లాడో తెలియక చుట్టుపక్కల విచారించిన తల్లిదండ్రులు చివరకు అతడికి ఫోన్ చేశారు. మొదట్లో అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్ది సేపటి తర్వాత అతడు ఫోన్ లిఫ్ట్ చేశాడు.
’అమ్మా.. నాకు కరోనా వచ్చింది. పొద్దున్నే టెస్ట్ రిజల్ట్ నా ఫోన్ కు మెసేజ్ వచ్చింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసకుంటున్నా. సారీ అమ్మా.. క్షమించండి నాన్నా.‘ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. విజయరాయిలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నానని ఫోన్లో చెప్పడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడకు వెళ్లేసరికే అతడు అపస్మారక స్థితిలో ఉండటం చూసి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చేసరికే అతడు మరణించాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా వచ్చినా కోలుకుంటారనీ, తగు జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని ఎదురించొచ్చని, ఎవరూ ఇలాంటి దారుణాలకు పాల్పడొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు.