Home /News /crime /

26 YEAR YOUNG MAN AFFAIR WITH 40 YEAR OLD MARRIED WOMAN LEADS TO THESE UNEXPECTED ENDING SSR

OMG: కొడుకు వయసుండే కుర్రాడితో ఈ మహిళ వివాహేతర సంబంధం.. చివరకు ఊహించని రీతిలో..

సురేందర్, లలిత (ఫైల్ ఫొటోలు)

సురేందర్, లలిత (ఫైల్ ఫొటోలు)

20 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఓ నడి వయసు మహిళ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అతనితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంది. చివరకు ఊహించని విధంగా అతని చేతిలోనే ఆ మహిళ హతమైంది.

    నమక్కల్: 20 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఓ నడి వయసు మహిళ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అతనితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంది. చివరకు ఊహించని విధంగా అతని చేతిలోనే ఆ మహిళ హతమైంది. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్‌లో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నమక్కల్ సమీపంలోని ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ బావిలో వివాహిత మృతదేహం కలకలం రేపింది. చనిపోయిన ఆ మహిళను కొసవంపట్టి ప్రాంతానికి చెందిన లలిత(40)గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లలితకు అదే ప్రాంతానికి చెందిన సురేందర్ అనే ఎంఎస్సీ చదివిన 26 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడింది. సురేందర్ తల్లిదండ్రులకు ఓ కిరాణా దుకాణం ఉంది. ఆ కిరాణా దుకాణానికి దగ్గరలోనే లలిత చేపలు అమ్ముకుంటూ ఉండేది.

    కిరాణా దుకాణానికి అతని తల్లిదండ్రులు లేని సమయంలో షాపు చూసుకోవడానికి వచ్చే సురేందర్ లలితతో పరిచయం పెంచుకున్నాడు. లలిత కూడా సురేందర్‌కు బాగా దగ్గరయింది. లలిత చిన్నచిన్న అవసరాలను తీర్చడంతో పాటు, ఇంట్లోకి కావాల్సిన సరుకులను సురేందర్ ఇచ్చేవాడు. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా చనువుగా మారి చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని నెలల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. లలిత ఇంటికి తరచూ సురేందర్ తరచూ వెళుతున్న సంగతి తెలిసిన అతని తల్లిదండ్రులు కొడుకుకి పెళ్లి చేయాలని నిర్ణయించారు. సురేందర్‌కు ఈ విషయం చెప్పారు.

    ఇది కూడా చదవండి: OMG: ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు.. మధ్యాహ్నం 2 గంటలు.. ఒకరు వంటగదిలో.. ఇద్దరు సీరియల్ చూస్తూ.. ఇంతలో..

    అప్పటి నుంచి సురేందర్ లలితను కలిసేందుకు వెళ్లడం మానేశాడు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన లలిత ఇటీవల ఒకరోజు సురేందర్‌కు ఫోన్ చేసి ఒకసారి కలిసి మాట్లాడాలని చెప్పింది. ఆమెను కలిసిన సురేందర్‌కు ఇద్దరం కలిసి చెన్నై వెళ్లిపోదామని.. అక్కడే హ్యాపీగా కలిసి బతుకుదామని లలిత చెప్పింది. లలిత చెప్పిన మాట సురేందర్‌కు రుచించలేదు. లలితతో ఈ విషయంలో పలుమార్లు సురేందర్ గొడవ పడ్డాడు.

    ఇది కూడా చదవండి: Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్న మరుసటి రోజే లారీ డ్రైవర్‌కు ఊహించని అనుభవం..

    ఈ క్రమంలోనే.. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సురేందర్ లలితను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే.. సరదగా బయటకు వెళ్దామని.. నువ్వు చెప్పినట్టే కొన్ని రోజుల తర్వాత చెన్నై వెళ్లిపోదామని సురేందర్ లలితను నమ్మించాడు. ఆమెను కారులో ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. లలితను చావబాదాడు. ఆమె చనిపోయాక సమీపంలోని బావిలో ఆమె మృతదేహాన్ని పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

    ఇది కూడా చదవండి: Chennai: బ్యాంకులో ఉద్యోగం.. నెలకు 2 లక్షలకు పైగానే జీతం.. కానీ ఏం లాభం.. డిసెంబర్ 31న..

    పోలీసులు లలిత కేసులో విచారణలో భాగంగా సురేందర్‌ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా ఓ యువకుడితో లలిత సాగించిన వివాహేతర సంబంధం చివరకు ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో పడి బంగారం లాంటి జీవితాలను కొందరు ఇలా చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Crime news, Extra marital affair, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు