కులం పేరుతో ర్యాగింగ్... ముంబైలో లేడీ డాక్టర్ ఆత్మహత్య...

Mumbai Crime News : కులం పేరుతో సీనియర్లు వేధిస్తుంటే తట్టుకోలేకపోయింది ఆ లేడీ డాక్టర్. ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమా అహూజా, భక్తి మెహర్, అంకిత ఖండేల్వాల్‌ను ఇంకా అరెస్టు చెయ్యకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 27, 2019, 12:11 PM IST
కులం పేరుతో ర్యాగింగ్... ముంబైలో లేడీ డాక్టర్ ఆత్మహత్య...
ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ (File)
  • Share this:
ముంబై సెంట్రల్‌లోని BYL నాయర్ హాస్పిటల్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా చేస్తున్న 26 ఏళ్ల పాయల్... మే 22న ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. హాస్పిటల్‌లో తక్కువ కులం అంటూ ఆమెను సీనియర్లు పదే పదే వేధిస్తుంటే, భరించలేకే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేధింపులపై ఇదివరకు లెక్చరర్లకు కంప్లైంట్లు ఇచ్చినా, వాళ్లు పట్టించుకోలేదనీ, దీనిపై డీన్‌తో మాట్లాడదామంటే, తమను అనుమతించలేదని పాయల్ తల్లి అబేదా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి న్యాయం జరగాలన్న ఆమె... వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిండాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాకు చెందిన పాయల్... టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో పీజీ కోర్స్ చేసేందుకు జాయిన్ అయ్యింది. ఈ కాలేజీ... BYL నాయర్ కాలేజీతో 2018 మే 1 అటాచ్ అయ్యింది.

గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ డాక్టర్లు తన భార్యను రకరకాలుగా వేధించారని పాయల్ భర్త డాక్టర్ సల్మాన్ డిపార్ట్‌మెంట్ పెద్దలకు డిసెంబర్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెలలు సైలెంటైన సీనియర్లు మళ్లీ వేధింపులు మొదలుపెట్టడంతో పాయల్ తీవ్ర ఆవేదన చెందింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి, ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆమె తల్లి అగ్రిపద పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. పాయల్‌ను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమా అహూజా, భక్తి మెహర్, అంకిత ఖండేల్వాల్‌ను అరెస్టు చెయ్యకపోవడంపై విమర్శలొస్తున్నాయి. దీనిపై గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌కి షోకాజ్ నోటీస్ పంపినట్లు కాలేజీ డీన్ డాక్టర్ రమేష్ భర్మల్ తెలిపారు.

డాక్టర్ ఆత్మహత్యపై మే 28న గిరిజన తెగలు... ఆందోళన చెయ్యాలని నిర్ణయించారు. సూసైడ్‌కి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....నేడు తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి...

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published: May 27, 2019, 12:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading