హోమ్ /వార్తలు /క్రైమ్ /

శునకంపై అత్యాచారం.. అర్ధరాత్రి ఓ యువకుడి నిర్వాకం.. చాటుగా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన కుర్రాళ్లు.. చివరకు..

శునకంపై అత్యాచారం.. అర్ధరాత్రి ఓ యువకుడి నిర్వాకం.. చాటుగా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన కుర్రాళ్లు.. చివరకు..

నిందితుడు సోమశేఖర్

నిందితుడు సోమశేఖర్

కఠిన చట్టాలు చేసినా కామాంధుల దుశ్చర్యలు ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఓ శునకంపై లైంగిక దాడికి యత్నించాడు. రాత్రిపూట అతడి నిర్వాకాన్ని చూసిన కొందరు వ్యక్తులు వీడియో తీసి నెట్టింట పెట్టారు. ఆ తర్వాత..

సోషల్ మీడియా వల్ల ఎంత మేలు జరుగుతోందో, అదే స్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. సోషల్ మీడియా సాయంతో వైరల్ అయ్యి ఉపాధి పొందిన వారు ఉన్నారు. అదే సమయంలో సామాజిక ఖాతాలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు అయితే అడ్డే లేదు. ఫేక్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుని మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. నగ్న వీడియోలను పంపిస్తూ, మార్ఫింగ్ ఫొటోలను పెడుతూ చిత్రహింసలు పెడుతున్నారు. అయితే కామాంధుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరింత నీచానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఓ శునకంపై లైంగిక దాడికి యత్నించాడు. రాత్రిపూట అతడి నిర్వాకాన్ని చూసిన కొందరు వ్యక్తులు వీడియో తీసి నెట్టింట పెట్టారు. దీంతో అతడు కటకటాల పాలయ్యాడు.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో గోకులం 3వ స్టేజ్ లో 26 ఏళ్ల సోమశేఖర్ నివసిస్తున్నాడు. అతడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటాడు. ఫిబ్రవరి 11వ తారీఖున రాత్రి 11 గంటల సమయంలో అతడు నిర్మానుష్యంగా ఉన్న ఓ సందులో ఓ శునకంపై లైంగిక దాడి చేశాడు. పైన అపార్ట్మెంట్లలో ఉండే కొందరు యువకులు అతడి నిర్వాకాన్ని వీడియో తీశారు. సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అయింది. అతడి నిర్వాకం పట్ల నెటిజన్లు భగ్గుమన్నారు. కామెంట్లతో అతడి నిర్వాకాన్ని తప్పుబట్టారు. ఆ వీడియో కాస్తా పీపుల్ ఫర్ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ దృష్టికి వెళ్లింది.

ఇది కూడా చదవండి: ఎన్నికల గొడవలు అనుకున్నారు.. కానీ పోలీసుల ఎంట్రీతో అతడి హత్యకు అసలు కారణమేంటో తెలిసి..

దీంతో ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వీవీపురం పోలీసులకు సోమశేఖర్ నిర్వాకం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జంతువులపై లైంగిక దాడి చేశాడన్న అభియోగంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. శునకాన్ని గుర్తించి వైద్య పరీక్షలు చేయించే పనిలో పోలీసులు పడ్డారు. అయితే సోమశేఖర్ నిర్వాకం గురించి మానసిక నిపుణులు స్పందించారు. అతడికి అశ్లీల చిత్రాలను చూసే అలవాటు ఉండేదని విచారణలో తేలిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అతిగా లైంగిక వాంఛ ఉన్నవారు తమ కోరికను ఆ క్షణంలో ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలని అనుకుంటారనీ, ఈ ఘటనలో అదే జరిగిందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ఘోరం.. రాత్రి పూట బర్త్ డే పార్టీ.. తెల్లారేసరికి హాస్టల్ గదిలో శవంగా.. అసలేం జరిగిందంటే..

First published:

Tags: Bengaluru, Crime news, Crime story, Mumbai crime, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు