• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 25 YEARS OLD YOUNG MAN COMMITS SUICIDE WHILE VIDEO CALL WITH HIS GIRLFRIEND DUE TO LOVE ISSUE IN SIDDIPET HSN

అర్ధరాత్రి ప్రేయసికి వీడియో కాల్.. ఆమె చూస్తుండగానే ఆ ప్రియుడు చేసిన నిర్వాకానికి బిత్తరపోయిన యువతి.. చివరకు..

అర్ధరాత్రి ప్రేయసికి వీడియో కాల్.. ఆమె చూస్తుండగానే ఆ ప్రియుడు చేసిన నిర్వాకానికి బిత్తరపోయిన యువతి.. చివరకు..

మనోజ్ కుమార్ (ఫైల్ ఫొటో)

25 ఏళ్ల ఆ కుర్రాడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఆమెతో జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. కానీ ఊళ్లో జరిగిన పంచాయితీ అతడిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. అర్ధరాత్రి ప్రేయసికి వీడియో కాల్ చేసి.

  • Share this:
    ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడా కుర్రాడు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్నాడు. ఎన్నో కలలు కన్నాడు. కానీ ఇరు కుటుంబాల్లోనూ వీళ్ల ప్రేమ విషయం తెలిసి రచ్చ రచ్చ అయింది. ఊళ్లో పంచాయితీ కూడా పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని పంచాయితీ పెద్దలు తీర్పునివ్వడంతో మనస్తాపం చెందాడు. తమ పెళ్లి ఇక జరగదేమోనన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఆ యువతి తనకు దక్కదని డిసైడయ్యాడు. ఆమె లేని జీవితం తనకు వద్దనుకున్నాడు. అర్ధరాత్రి ప్రేయసికి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడాడు. ఆమె చూస్తుండగానే బ్లేడ్ తీసుకుని మణికట్టు, గొంతు కోసుకున్నాడు. ఆ యువతి వెంటనే అప్రమత్తమయి అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. సిద్ధిపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సిద్దిపేట హౌసింగ్ బోర్డు పరిధిలోని అరుంధతి కాలనీకి చెందిన 25 ఏళ్ల మనోజ్ కుమార్ ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్నాడు. సిద్దిపేట సిటీకి దగ్గరలోనే ఉండే ఓ గ్రామానికి చెందిన యువతిని మనోజ్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరి ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల్లోనూ తెలిసింది. దీంతో రచ్చ రచ్చ అయింది. పంచాయితీ జరిగింది. చివరకు ఆ యువతితో దూరంగా ఉండాలని పంచాయితీ పెద్దలు తీర్పునిచ్చారు. ఆ తీర్పు పట్ల మనోజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రేయసి లేని జీవితం తనకు అక్కర్లేదనుకున్నాడు.
    ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!

    బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బోజనం చేశాడు. ఆ తర్వాత పై అంతస్తులో ఉండే తన గదికి వెళ్లాడు. అక్కడే ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతికి మనోజ్ వీడియో కాల్ చేశాడు. ‘నువ్వు లేకుండా నేను బతకలేను. నీతో మాట్లాడకుండా ఉండలేను. చివరి సారిగా నిన్ను కళ్లారా చూసుకుందామనే ఫోన్ చేశా. బై బంగారం. జాగ్రత్త‘ అంటూ చివరి సారిగా మాట్లాడి ప్రేయసి చూస్తుండగానే బ్లేడుతో చేతి మణికట్టు, గొంతు కోసుకున్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమయిన ఆ యువతి, అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వాళ్లు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. గురువారం యువకుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు