థియేటర్‌లో నరకం... పక్కనే కూర్చొని... ఆమె నడుంపై చెయ్యి వేసి...

Ahmedabad Crime : థియేటర్‌కి వెళ్లడం, మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటం బాగుంటుంది. ఇలా జరిగితే మాత్రం ఏ అమ్మాయీ తట్టుకోలేదు. నరకమే.

Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 1:56 PM IST
థియేటర్‌లో నరకం... పక్కనే కూర్చొని... ఆమె నడుంపై చెయ్యి వేసి...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 1:56 PM IST
అహ్మదాబాద్‌లోని పాతికేళ్ల భవ్యశ్రీ (పేరు మార్చాం)... తన భర్తతో కలిసి... సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమాకి వెళ్లింది. ఇద్దరూ తమకు రిజర్వ్ చేసుకున్న సీట్లలో కూర్చున్నారు. కాసేపటికి జనగణమన జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. ఆడియన్స్ మొత్తం నిల్చున్నారు. సరిగ్గా అప్పుడే... థియేటర్‌లోకి ఎంటరయ్యాడు ఒకడు. ఏజ్ 25 నుంచీ 30 ఏళ్లు ఉండొచ్చు. జాతీయ గీతం వస్తుండటంతో... థియేటర్ డోర్ దగ్గరే నిల్చున్నాడు. గెడ్డంతో, క్లాస్ కళ్లజోడుతో ఉన్నాడు. అప్పటికే తన పక్కన ఖాళీ సీటు ఉంది, ఎవరు కూర్చుంటారో ఏమో అన్న కంగారులో ఉంది భవ్యశ్రీ. జనగణమన పూర్తవగానే వచ్చి... భవ్యశ్రీ పక్కన కూర్చున్నాడు ఆ వ్యక్తి. కొంత అసౌకర్యంగా ఫీలైంది భవ్యశ్రీ.

అతను చేతులు కట్టుకొని కూర్చోవడంతో... భవ్యశ్రీ ఇక అతని సంగతి మర్చిపోయింది. కపుల్స్ ఇద్దరూ సినిమా చూడటంలో మునిగిపోయారు. కాసేపటికి... తన నడుంపై ఏదో వాలినట్లు అనిపించింది భవ్యశ్రీకి. ఉలిక్కిపడింది. నడుంవైపు చూసుకుంది. అక్కడ ఏమీ లేదు. ఏం లేదులే అనుకుంటూ... మళ్లీ సినిమాలో మునిగిపోయింది. కాసేపటికి మళ్లీ నడుంపై నుంచీ ఏదో పురుగు పాకుతున్నట్లు అనిపించింది. ఈసారి మరింత వేగంగా చూసుకుంది. మళ్లీ అంతే. నడుంపై ఏమీ లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. పక్కన కూర్చున్న అతనివైపు చూసింది. ఏమాత్రం సంబంధం లేనట్లు అలాగే చేతులు ముడుచుకొని... సినిమా చూస్తున్నాడు. ఆమెవైపు అస్సలు చూడలేదు.

రెండుసార్లు ఒకేలా జరగడంతో భవ్యశ్రీకి సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. సినిమా చూస్తోందేగానీ... మనసంతా నడుంపైనే ఉంది. ఆమె అనుకున్నట్లుగానే మూడోసారీ ఆమె నడుంపై ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించింది. ఒక్కసారిగా అతనివైపు చూసింది. అతను ఎప్పట్లాగే ఏమీ ఎరగనట్లు సినిమా చూస్తూ ఉన్నాడు. ఆమెవైపు అస్సలు చూడలేదు. ఇక లాభం లేదనుకున్న భవ్యశ్రీ... తన భర్తతో... "ఏవండీ... మీరు ఇటు కూర్చోండి... నేను అటు కూర్చుంటాను" అంది. ఆయన సరే అన్నాడు. ఇద్దరూ సీట్లు మారారు. అంతే... భవ్యశ్రీ పక్కన కూర్చున్న అతను... వెంటనే లేచి వెళ్లిపోయాడు.

సినిమా అయిపోయాక... సీసీటీవీ ఫుటేజ్ చూపించమన్నారు ఆ కపుల్స్. ఆ ఫుటేజ్‌లో... స్క్రీన్ 4 నుంచీ మధ్యలోనే బయటకు వచ్చేసిన ఆ గడ్డం వ్యక్తి... స్క్రీన్ 3లోకి వెళ్లాడు. సంథింగ్ తేడాగా ఉన్నట్లు అనిపించడంతో... అతనిపై వస్త్రపూర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...