Home /News /crime /

25 YEAR OLD MAN SLITS WRIST AND THROAT WITH DEBIT CARD IN CHENNAI PERAVALLUR POLICE REVEALS SHOCKING TRUTH MKS

Debit Card: అమ్మాయి చేసిన పనికి ఏటీఎం కార్డుతో గొంతు కోసుకున్నాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏటీఎం కార్డును ఇలా కూడా వాడతారా? అని షాకిచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి చేతిలో మోసపోయిన ఓ యువకుడు.. అమ్మాయి తల్లి చేసిన హడావుడికి బెంబేలెత్తిపోయి ఏటీఎం కార్డుతో గొంతు, మణికట్టు కోసేసుకున్నాడు. అసలేం జరిగిందో పోలీసులు చెప్పారు..

ఇంకా చదవండి ...
భయంతో వణికిపోతూ 53 ఏళ్ల మహిళ పరుగెత్తుకుంటూ రోడ్డుమీదికొచ్చింది.. సహాయం కోసం దిక్కులు చూస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ వాహనానికి ఎదురుగా పరుగెత్తింది.. సడన్ బ్రేక్ కొట్టి వాహనాన్ని ఆపిన పోలీసులకు జరిగిందింటో చెప్పింది.. ఆమె మాటలు పూర్తికాకుండానే అపార్ట్మెంట్ వైపు దూసుకెళ్లిన పోలీసులు ఫ్లాట్ తలుపులు బద్దలుకొట్టారు.. లోపల రక్తపు మడుగులో పడున్న యువకుడు కనిపించాడు.. ఏటీఎం కార్డుతో గొంతు కోసుకున్నట్లు గుర్తించిన వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.. అసలా ఇంట్లో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? అని పోలీసులు ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. చెన్నై శివారు పేరవల్లూర్ లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి..

పాండిచేరికి చెందిన 25 ఏళ్ల యువకుడు అరవిందన్ 2018లో చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో పీజీ చదివాడు. అదే కాలేజీలో అతనికో అమ్మాయి పరిచయమైంది. క్లాస్ మేట్ కావడంతో ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. అన్ని విషయాలను షేర్ చేసుకునే ఆ అమ్మాయంటే మనోడికి ఇష్టం ఏర్పడింది. ఆమె ఏదడిగినా ఠక్కున ఇచ్చేసేవాడు. అరవిందన్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతని దగ్గర్నుంచి రూ.3.5లక్షలు సహాయంగా పొందిందా అమ్మాయి. తీసుకున్న డబ్బుల్ని కచ్చితంగా తిరిగిస్తానని మాట కూడా ఇచ్చింది. కాలేజీ పూర్తయిన తర్వాత కూడా వాళ్లిద్దరి పరిచయం కోనసాగింది. కానీ డబ్బులు మాత్రం ఎంతకీ తిరిగిరాలేదు. ఒక దశలో..

UP Elections 2022: 'బికినీ గర్ల్‌'పై బీజేపీ గరంగరం.. కలిపి చూడొద్దన్న Archana Gautam


క్లాస్ మేట్ అయిన అమ్మాయికి రూ.3.5లక్షలు అప్పుగా ఇచ్చాడన్న విషయం తెలిసి అరవిందన్ కుటుంబీకులు చీవాట్లు పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతను అమ్మాయిపై ఒత్తిడి పెంచాడు. అప్పట్నుంచి ఆమె ఇతణ్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో ఆమె ఇంటికే వెళ్లి తేల్చుకుందామనుకున్నాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో పేరవల్లూర్ లోని అమ్మాయి ఇంటికి అరవిందన్ అప్పుడప్పుడూ వెళుతుండేవాడు. తెలిసిన ఇల్లే కాబట్టి సోమవారం సాయంత్రం నేరుగా ఫ్లాట్ కు వెళ్లి తలుపుకొట్టాడు. ఎందుకు వచ్చాడో ముందే తెలిసినా, అసలు అతనెవరో తెలీనట్లు అమ్మాయి తల్లి బిల్డప్ ఇచ్చింది. డోర్ దగ్గరే వాగ్వాదం జరిగింది. లోపలికి రావొద్దన్న ఆమెను తోసుకుంటూ అరవిందన్ ముందుకు కదిలాడు. దీంతో ఆమె.. అయ్యయ్యో.. మా ఇంట్లోకి దొంగోడు దూరాడంటూ గట్టిగా కేకలు వేసింది.. ఆ పరిణామంతో షాకైన అరవిందన్ ఓ గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నాడు..

Viral Emirates Ad : బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే Videoఇంట్లోకి దొంగ దూరాడు.. నాపై దాడి చేశాడంటూ రోడ్డుమీదికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆ మహిళ పోలీసుల సాయం కోరింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టే సరికే ఏటీఎం కార్డుతో గొంతు, మణికట్టును కోసేసుకున్నాడు అరవిందన్. అతణ్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు.. కాస్త కోలుకున్న తర్వాత ఆరా తీయగా ఏం జరిగిందో అరవిందన్ చెప్పుకొచ్చాడు. ఆ మహిళ తనను దొంగ అనేసరికి భయపడిపోయానని, అందుకే ఏటీఎం కార్డుతో గొంతు, మణికట్టు కోసుకున్నానని చెప్పాడు. రెండు వైపుల వాదనలను విన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన సమయంలో అరవిందన్ నుంచి డబ్బులు తీసుకున్న అమ్మాయి ఇంట్లో లేదని, ఆమె జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Chennai, Debit card

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు