చెల్లి నగ్న వీడియోను బాయ్‌ ఫ్రెండ్‌కు పంపిన యువతి

తనను పెళ్లి చేసుకోవాలంటే తన సోదరి ఫొటోలను పంపించాలని కండిషన్ పెట్టాడని సదరు యువతి తెలిపింది. అందుకే చెల్లి స్నానం చేస్తుండగా వీడియో కాల్ చేసి అతడికి చూపించానని వెల్లడించింది.

news18-telugu
Updated: November 1, 2019, 10:36 PM IST
చెల్లి నగ్న వీడియోను బాయ్‌ ఫ్రెండ్‌కు పంపిన యువతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చెల్లిని కంటికి రెప్పలా చేసుకుంటారు అక్కలు. సోదరికి ఏ అవరమున్నా.. ఏ కష్టమొచ్చినా.. అన్నీ తానై చూసుకుంటుంది. అమ్మ తర్వాత అమ్మలాంటిది అక్క. కానీ ఆ యువతి మాత్రం చెల్లి పాలిట రాక్షసిగా మారింది. చెల్లి స్నానం చేస్తున్న న్యూడ్ వీడియోను రికార్డ్ చేసి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించింది. ముంబైలోని బైకుల్లాలో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు 25 ఏళ్ల అక్క ఉంది. ఆమె సోదరికి అదే ప్రాంతంలో ఉండే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. అతడికి ఆల్రెడీ పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. అతడితో సంబంధం పెట్టుకున్న యువతి.. సొంత చెల్లి నగ్న వీడియోలు పంపించింది.

నిందితుడి సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు గుర్తించిన అతడి భార్య.. సదరు యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అతడితో తమ పెద్దకూతురు వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి పేరెంట్స్ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు తమ చిన్న కూతురి నగ్న ఫొటోలను అతడికి పంపంచిందని తెలియడంతో నిలదీశారు. ఐతే తనను పెళ్లి చేసుకోవాలంటే తన సోదరి ఫొటోలను పంపించాలని కండిషన్ పెట్టాడని సదరు యువతి తెలిపింది. అందుకే చెల్లి స్నానం చేస్తుండగా వీడియో కాల్ చేసి అతడికి చూపించానని వెల్లడించింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి అక్కను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడి రివెంజ్ స్టోరీ బయటపడింది. నవరాత్రి వేడుకల్లో అతడి కూతురిని కర్రతో కొట్టినందుకు ఆ యువతిపై కక్షపెంచుకున్నాడు. అందుకే ఆమె అక్కకు దగ్గరై చెల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. చెల్లి నగ్న వీడియోలు పంపిస్తేనే తనను పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేయడంతో.. సదరు యువతి చెల్లి స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.First published: November 1, 2019, 10:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading