హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : పెళ్లింట పెను విషాదం..బస్సు లోయలో పడి 25మంది మృతి

OMG : పెళ్లింట పెను విషాదం..బస్సు లోయలో పడి 25మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bus Bus Fell Into Gorge : ఉత్తరాఖండ్(Uttarakhand) లో ఘోర విషాదం చోటుచేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Bus Fell Into George : ఉత్తరాఖండ్(Uttarakhand) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పౌరీ గర్వాల్‌ జిల్లాలో సిమ్డి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 55 మంది పైగా వివాహ బృందంతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 25మందిమరణించారు.హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 500మీటర్ల లోతైన లోయలో బస్సు పడటంతో సంఘటన స్థలానికి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఎన్సీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. సిమ్డి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు రాత్రిపూట ఆపరేషన్ చేసి మొత్తం 21 మంది ప్రయాణికులను రక్షించారు.

ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంతాపం తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్‌ ఓ ట్వీట్ లో..ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ తీరని లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను"అని ట్వీట్ లో పేర్కొన్నారు.

రాష్ట్ర పోలీసు చీఫ్ అశోక్ కుమార్.. రెస్క్యూ ఆపరేషన్ ఫొటోలను ట్వీట్ చేశారు, ఇందులో రెస్క్యూ బృందాలు గాయపడిన ప్రయాణీకులను సురక్షితంగా తీసుకువెళ్లడం చూడవచ్చు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.

అంతకుముందు, హరిద్వార్ పోలీసు చీఫ్ స్వతంత్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ.." జిల్లాలోని లాల్‌ధాంగ్ నుండి వివాహ బృందం బయలుదేరిందని, ఆ తర్వాత బస్సు ప్రమాదానికి గురైందని తమకు సమాచారం అందింది"అని తెలిపారు.

Big Announcement: అమిత్ షా బిగ్ అనౌన్స్ మెంట్..రిజర్వేషన్ పెంపుపై సంచలన హామీ

మరోవైపు, మంగళవారం ఉదయం ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండా-2 శిఖరాగ్రంపైన అకస్మాత్తుగా హిమపాతం సంభవించగా, అందులో చిక్కుకున్న పదిమంది శిక్షణ పర్వతారోహకులు మృతిచెందారు. వీరంతా నెహ్రూ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఎం)కు చెందినవారు. హిమపాతంలో చిక్కుకున్న ఎనిమిది మందిని తమ బృందం కాపాడిందని ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ కల్నల్‌ అమిత్‌ బిష్త్‌ తెలిపారు.తమ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 34 మంది పర్వతారోహకులతోపాటు ఏడుగురు ఇన్‌స్ట్రక్టర్లు చిక్కుకుపోయారని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Uttarakhand

ఉత్తమ కథలు